ఇరాన్‌కు అణ్వాయుధం దక్కే ఛాన్సే లేదు: ట్రంప్
- ఆ దేశాన్ని ఇప్పటికే తీవ్రంగా శిక్షించామని వ్యాఖ్య
- 9/11 దాడుల 25వ వార్షికోత్సవ సభలో కీలక వ్యాఖ్యలు
- 9/11 హీరో వెల్లెస్ క్రౌథర్‌కు మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఆ దేశం అణ్వస్త్ర తయారీ దిశగా అడుగులు వేయకుండా తాము కఠిన చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే ఆంక్షల రూపంలో వారిని కట్టడి చేశామని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో మంగళవారం జరిగిన ‘స్టీల్ అక్రాస్ అమెరికా’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "ఒక దేశం అణ్వాయుధాన్ని సాధించాలని భావించి, ఆ లక్ష్యానికి అత్యంత చేరువగా వెళ్లింది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం వారికి లేదు. వారికి అణ్వాయుధం ఎప్పటికీ దక్కదు" అని ఇరాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై విధించిన ఆంక్షలు అత్యంత శక్తిమంతంగా, సమర్థవంతంగా పనిచేశాయని, ఈ స్థాయిలో విజయం లభిస్తుందని ఎవరూ ఊహించలేదని ఆయన అమెరికా సైన్యాన్ని ప్రశంసించారు.
సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ దాడుల్లో అసువులు బాసిన సుమారు 3 వేల మందిని స్మరించుకుంటూ ట్రంప్ ప్రసంగం సాగింది. ఈ సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్ శిథిలాల నుంచి వెలికితీసిన 16,000 పౌండ్ల ఉక్కు దూలాన్ని ప్రదర్శించారు. ఉగ్రదాడుల సమయంలో ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన ఫైర్‌ఫైటర్ జెఫ్రీ పలాజో గౌరవార్థం.. కోస్ట్ గార్డ్‌కు చెందిన ఓ నూతన నౌకకు ఆయన పేరు పెట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇదే కార్యక్రమంలో ‘ది మ్యాన్ ఇన్ ది రెడ్ బందానా’గా గుర్తింపు పొందిన వెల్లెస్ క్రౌథర్‌కు మరణానంతరం అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను అందజేశారు. ఆయన తరఫున తల్లి అలీసన్ క్రౌథర్ ఈ గౌరవాన్ని స్వీకరించారు.