భారత్‌లో పుంజుకున్న నియామకాలు.. మెట్రో నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానం
- భారత్‌లో 14 శాతం పెరిగిన వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు
- నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదికలో వెల్లడి
- ఆటోమొబైల్, హెల్త్‌కేర్ రంగాల్లో నియామకాల జోరు
- అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భువనేశ్వర్ టాప్
భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 14 శాతం వృద్ధి నమోదైంది. ఈ విషయంలో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ 23 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. ఈ వివరాలను ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరీ డాట్ కామ్' తన 'జాబ్‌స్పీక్ ఇండెక్స్' నివేదికలో వెల్లడించింది.
నౌకరీ డాట్ కామ్ నివేదిక ప్రకారం, గత ఏడాది ఆగస్టులో 2,664 పాయింట్లుగా ఉన్న జాబ్‌స్పీక్ సూచీ, ఈ ఏడాది ఆగస్టు నాటికి 3,028 పాయింట్లకు చేరింది. ముఖ్యంగా ఆటోమొబైల్, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ రంగాలు ఈ వృద్ధికి కీలక పాత్ర పోషించాయి. ఆటోమొబైల్ రంగంలో నియామకాలు 19 శాతం పెరగ్గా, ఆరోగ్య సంరక్షణ రంగంలో 16 శాతం, రిటైల్ రంగంలో 15 శాతం వృద్ధి కనిపించింది.
మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ తర్వాత కోల్‌కతా 22 శాతం వృద్ధితో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భువనేశ్వర్ 32 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాయ్‌పూర్ (23 శాతం), సూరత్ (21 శాతం), రాంచీ (19 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐటీ, ఐటీయేతర రంగాల్లో ఈ సానుకూల ధోరణి కనిపించిందని నౌకరీ డాట్ కామ్ తెలిపింది. అంతేకాకుండా, ఫ్రెషర్ల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల వరకు అన్ని అనుభవాల కేటగిరీల్లోనూ నియామకాలు పెరగడం గమనార్హం.