కార్యకర్తలే పార్టీకి బలం.. వారిని ఉన్నతస్థాయికి తీసుకురండి: లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో చంద్రబాబు
- కార్యకర్తలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన
- సమస్యల పరిష్కారంలో మంత్రులు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టీకరణ
- స్వర్ణాంధ్ర విజన్-2047ను క్షేత్రస్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపు
- ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నియోజకవర్గానికి రూ.1 కోటి కేటాయింపు
- టెక్నాలజీతో వందేళ్ల పనిని పదేళ్లలో పూర్తి చేయవచ్చన్న ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల రాజకీయ, ఆర్థిక సాధికారతకు కృషి చేయాలని, అదే సమయంలో స్వర్ణాంధ్ర విజన్-2047ను క్షేత్రస్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని స్పష్టం చేశారు. కార్యకర్త బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, వారిని నిరాశకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "టీడీపీ కార్యకర్త హుషారుగా ఉంటే గెలుపును ఎవరూ ఆపలేరు. కార్యకర్తల్లో చాలా మంది పేదవారు ఉన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు వారికి అందేలా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి, అక్కడి పరిస్థితులను బట్టి టికెట్లు కేటాయిస్తాం. వారు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందేలా ఎమ్మెల్యేలు ప్రోత్సాహం, మార్గనిర్దేశం అందించాలి. ప్రజలు మెచ్చే విధంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాం" అని హామీ ఇచ్చారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని, లేనిపక్షంలో వారే జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.
విజన్-2047తో నియోజకవర్గాల అభివృద్ధి
స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విజన్‌కు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు తమ ఆలోచనలతో విలువ జోడించాలని (వాల్యూ ఎడిషన్) సూచించారు. "విజన్ ప్లాన్ అమలు చేస్తే అభివృద్ధి సాధ్యమవడమే కాదు, ఎన్నికల్లోనూ గెలుపు ఖాయం. పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గించడమే ఈ విజన్ ప్రధాన లక్ష్యం. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ, ప్రతి నియోజకవర్గానికి రూ.1 కోటి చొప్పున కేటాయించాలని నిర్ణయించాం" అని తెలిపారు.
కేంద్ర మంత్రులుగా ఉన్నవారు జాతీయ స్థాయిలో శాఖలను పర్యవేక్షిస్తున్న స్ఫూర్తితోనే తమ జిల్లాలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల్లో ఉన్నత విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారని, వారంతా తమ అనుభవంతో విజన్ డాక్యుమెంట్లను అధ్యయనం చేసి, వినూత్నంగా ఆలోచించాలని కోరారు. "వందేళ్లలో జరిగే పనులను పదేళ్లలో పూర్తి చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రతి ఎమ్మెల్యే అకుంఠిత దీక్షతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు" అని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.