పాక్ కెప్టెన్‌కు ఐసీసీ ఫైన్.. షఫాలీని ఔట్ చేసి సైగలు చేయడంతో చర్యలు

పాక్ కెప్టెన్‌కు ఐసీసీ ఫైన్.. షఫాలీని ఔట్ చేసి సైగలు చేయడంతో చర్యలు

Fatima Sana fined by ICC for gestures after dismissing Shafali Verma
  • షఫాలీ వర్మను ఔట్ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న పాక్ కెప్టెన్
  • ఫాతిమా సనా ప్రవర్తనపై చర్యలు తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి
  • మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయింపు
  • 24 నెలల వ్యవధిలో ఫాతిమాకు ఇది రెండో డీమెరిట్ పాయింట్
  • ఈ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత మహిళల జట్టు
మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించింది. టీమిండియా బ్యాటర్ షఫాలీ వర్మ వికెట్ తీసిన అనంతరం అనుచితంగా ప్రవర్తించినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు, ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ షఫాలీ వర్మ (12) ఫాతిమా సనా బౌలింగ్‌లోనే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. వికెట్ తీసిన ఉత్సాహంలో ఫాతిమా, షఫాలీని ఉద్దేశించి పెవిలియన్ వైపు వేళ్లాలంటూ వేలితో సైగ చేస్తూ అనుచితంగా ప్రవర్తించింది. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించడమేనని మ్యాచ్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గత 24 నెలల కాలంలో ఫాతిమా సనాకు ఇది రెండో డీమెరిట్ పాయింట్ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు 6న ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ క్రీజు వదిలి వెళ్లేందుకు నిరాకరించినందుకు ఆమె ఖాతాలో తొలి డీమెరిట్ పాయింట్ చేరింది.
Advertisement
Fatima Sana
Shafali Verma
Women Asia Cup
ICC Fine
India vs Pakistan Women
Cricket Discipline Breach

More Telugu News