టీడీపీ సదస్సులో ‘P4-విజన్ 2047’పై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజెంటేషన్
- ప్రజల భాగస్వామ్యంతోనే విజన్ లక్ష్యాలు సాధ్యమని స్పష్టీకరణ
- ప్రతి శాఖ పనితీరుకు కేపీఐలు ఉండాలని, పనితీరును కొలవాలని సూచన
- ‘నా నియోజకవర్గం–నా విజన్, నా యాక్షన్ ప్లాన్–నా బాధ్యత’ లక్ష్యంతో ఎమ్మెల్యేలు పనిచేయాలి
- యువతకు కంపెనీల భాగస్వామ్యంతో శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు అందించాలని పిలుపు
సమావేశాల సంఖ్య కాదు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం అని టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ‘P4–స్వర్ణాంధ్ర విజన్ 2047’పై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. కేవలం ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే కాకుండా ప్రజలు, యువత భాగస్వాములైతేనే ‘విజన్ 2047’ లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆమె పిలుపునిచ్చారు. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ‘P4’ (ప్రజలు, ప్రైవేటు, ప్రభుత్వం, భాగస్వామ్యం) విధానాన్ని తీసుకొచ్చారని వివరించారు.
ప్రతి ఎమ్మెల్యే ‘నా నియోజకవర్గం–నా విజన్, నా యాక్షన్ ప్లాన్–నా బాధ్యత’ అనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. తమ నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని మోడల్ గ్రామంగా, మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడమే కాకుండా, వివిధ శాఖలను సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలే చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలా నియోజకవర్గ అభివృద్ధి ప్రగతిని ప్రజల ముందుంచి జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు.
ప్రతి శాఖకు, ప్రతి కార్యక్రమానికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIలు) తప్పనిసరిగా ఉండాలని ప్రశాంతిరెడ్డి నొక్కిచెప్పారు. కేపీఐల ద్వారా పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, లోపాలున్న చోట వేగంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. 2029 నాటికి రాష్ట్ర జీడీపీని రూ.66 లక్షల కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని, రైతుల ఆదాయం పెంచేందుకు పంటలకు విలువ జోడింపు (ప్రాసెసింగ్, ప్యాకేజింగ్) చేయాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కంపెనీల భాగస్వామ్యంతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు అందించాలని ప్రతిపాదించారు. సంజీవని ఆరోగ్య ప్రాజెక్ట్ ద్వారా సుమారు 85 లక్షల మంది ఆరోగ్యంపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుందని ఆమె వెల్లడించారు.