ఒకప్పుడు సలహాలు ఇచ్చా.. ఇప్పుడు అతని ట్వీట్లు బాధపెడుతున్నాయి: భారత మాజీ ఆల్‌రౌండర్‌పై వసీం అక్రమ్ అసంతృప్తి!
- ఇర్ఫాన్ పఠాన్ మంచి అబ్బాయేనన్న పాక్ దిగ్గజం వసీం అక్రమ్
- కానీ పాకిస్థాన్‌పై ఇర్ఫాన్ సోషల్ మీడియా పోస్టులు నిరాశపరిచాయని వ్యాఖ్య
- 2004లో ఇర్ఫాన్‌కు బౌలింగ్ టిప్స్ ఇచ్చానని గుర్తుచేసుకున్న అక్రమ్
- భారత్-పాక్ మ్యాచ్‌ను కేవలం ఆటలాగే చూడాలని అభిమానులకు సూచన
- పగ, ప్రతీకారం అనేవి పాతకాలం ఆలోచనలని హితవు
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్.. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇర్ఫాన్ మంచి వ్యక్తి అని చెబుతూనే, అతను సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చేసే పోస్టుల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఒకప్పుడు తన వద్ద బౌలింగ్ మెలకువలు నేర్చుకున్న ఇర్ఫాన్ ఇలా ప్రవర్తించడం తనను నిరాశపరిచిందని పరోక్షంగా వెల్లడించాడు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. "ఇర్ఫాన్ పఠాన్‌ను నేను తొలిసారి 2004లో ఆస్ట్రేలియా పర్యటనలో కలిశాను. అప్పుడు నేను కామెంటరీ చేస్తున్నాను. అతను నా బౌలింగ్ చూస్తూ పెరిగానని, నాకు పెద్ద అభిమాని అని చెప్పాడు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా దాదాపు నాలాగే ఉండేది. కెరీర్ ఆరంభంలో అద్భుతంగా రాణించాడు. నేను అతనికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాను. ముఖ్యంగా మానసిక దృక్పథం, మణికట్టును ఎలా ఉపయోగించాలి, బ్యాటర్‌ను ఎలా అంచనా వేయాలి, వేరియేషన్స్ ఎప్పుడు ప్రయోగించాలి వంటి విషయాలు చెప్పాను" అని గుర్తుచేసుకున్నాడు.
అయితే, ఇర్ఫాన్‌తో మంచి సంబంధం ఉన్నప్పటికీ, అతని సోషల్ మీడియా తీరుపై అక్రమ్ అసహనం వ్యక్తం చేశాడు. "ఇర్ఫాన్ మంచి అబ్బాయి. ఇప్పటికీ కలిసినప్పుడు బాగా మాట్లాడతాడు. కానీ, అది వేరే విషయం. అతను పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏవో ట్వీట్లు పెడుతుంటాడు. దానికి బదులివ్వడానికి మా అభిమానులు కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్లు దేన్నీ తేలిగ్గా వదిలిపెట్టరు" అని వ్యాఖ్యానించాడు.
ఇదే సందర్భంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల సమయంలో అభిమానుల అత్యుత్సాహం గురించి కూడా అక్రమ్ మాట్లాడాడు. "ప్రజలకు చాలా ఖాళీ సమయం దొరుకుతున్నట్టుంది. అదొక ఆట మాత్రమేనని ఎందుకు అర్థం చేసుకోరు? ఎవరో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. దాంతో ఆ విషయాన్ని వదిలేసి ముందుకు సాగాలి. కానీ ఎప్పుడో జరిగిన విషయాలను పట్టుకుని వేలాడుతున్నారు. పగ, ప్రతీకారం అనేవి 1970ల నాటి ఆలోచనలు" అంటూ అభిమానులకు హితవు పలికాడు.