'రోమాంచకం' ఫస్ట్ కట్ చూసి సందీప్ వంగా ఫుల్ హ్యాపీ!
- సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా 'రోమాంచకం'
- రేపు ప్రేక్షకుల ముందుకు చిత్రం
- ఇంజినీరింగ్ కుర్రాడి ప్రేమకథ, స్నేహితుల గ్యాంగ్‌తో సరదాగా సాగే చిత్రం
- సహజమైన కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయన్న నిర్మాత ప్రణయ్ వంగా
- యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది
ప్రభాస్‌తో 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నప్పటికీ, తన సోదరుడు నిర్మించిన చిత్రంపై బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పూర్తి శ్రద్ధ పెట్టారు. ఆయన సమర్పణలో వస్తున్న 'రోమాంచకం' సినిమా ఫస్ట్ కట్ చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై సందీప్ సంతృప్తిగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'భద్రకాళీ పిక్చర్స్' బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘటనలు, అతని ప్రేమకథ, స్నేహితుల మధ్య ఉండే గందరగోళం చుట్టూ కథ ఆహ్లాదకరంగా సాగుతుందని ఆయన తెలిపారు. సినిమాలో కామెడీ బలవంతంగా కాకుండా, కథలో భాగంగా చాలా సహజంగా ఉంటుందని స్పష్టం చేశారు.
దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి గత 3-4 ఏళ్లుగా తమతో ప్రయాణిస్తున్నారని, ఆయన చెప్పిన కథలోని హ్యూమర్, థ్రిల్లింగ్ అంశాలు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ప్రణయ్ రెడ్డి వివరించారు. "ప్రాజెక్ట్ ఓకే అయ్యాక సందీప్ 'స్పిరిట్' సినిమా పనుల్లో బిజీ అయ్యారు. దాంతో ఆయన క్రియేటివ్ పరంగా ఎలాంటి జోక్యం చేసుకోలేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అయితే, సినిమా ఫస్ట్ కట్ చూశాక మాత్రం సందీప్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు" అని నిర్మాత పేర్కొన్నారు.
సుమారు 2 గంటల 20 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా, సరదాగా సాగిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూడదగ్గ చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.