అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ.. 5 వేల మందిలో మాజీ ఎయిర్ మార్షల్ ఎంపిక!
- రామ మందిరానికి తొలి సీఈఓగా జీతేంద్ర మిశ్రా ఎంపిక
- గతంలో ఎయిర్‌ఫోర్స్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా బాధ్యతలు
- సీఈఓ అధికారాల కోసం ట్రస్ట్ డీడ్‌లో మార్పులు
- మందిర భద్రతకు శాశ్వత కమిటీ ఏర్పాటు ప్రతిపాదన
- విరాళాల అక్రమాలపై సిట్ విచారణను సమీక్షించనున్న ట్రస్ట్
అయోధ్య రామ మందిరం పరిపాలనకు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాను నియమించే అవకాశం ఉంది. 5 వేల మందికి పైగా దరఖాస్తుదారుల నుంచి ఆయన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత వైమానిక దళంలో పలు కీలక కమాండ్ బాధ్యతలు నిర్వహించిన జీతేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో 12 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో రామ మందిరానికి తొలి సీఈఓ నియామకం ప్రధాన అంశంగా ఉంది. సీఈఓకు విస్తృత పరిపాలనా అధికారాలు కల్పించేలా ట్రస్ట్ డీడ్‌లో మార్పులు చేయాలని కూడా నిర్ణయించే అవకాశం ఉంది.
2020 ఫిబ్రవరి 5న ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత డీడ్‌లో మార్పులు చేయడం ఇదే తొలిసారి కానుంది. మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలు, సమర్పణల నగదు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ నిర్వహిస్తున్న మూడో సమావేశం ఇది. ఈ వ్యవహారం నేపథ్యంలో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేశారు.
మందిరం పరిపాలనను మరింత ప్రొఫెషనల్‌గా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి సీఈఓ అవసరమని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా గతంలో పేర్కొన్నారు. సీఈఓ ప్రభుత్వ జోక్యం లేకుండా పనిచేస్తారని, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారని సమాచారం.
సీఈఓకు చట్టపరమైన, పరిపాలనా, ఆర్థిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సంస్థకు అవసరమైన విధానాలు, వ్యవస్థలు, నిర్వహణ పద్ధతులను రూపొందించడం, ట్రస్ట్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, చట్టపరమైన నిబంధనలను పాటించేలా చూడటం వంటి బాధ్యతలు కూడా ఆయన పరిధిలోకి రానున్నాయి. సంస్థ భవిష్యత్ అభివృద్ధి, సమర్థవంతమైన నిర్వహణలో సీఈఓ అత్యున్నత కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరించనున్నారు.
మందిర భద్రత కోసం శాశ్వత స్థానిక భద్రతా సమన్వయ కమిటీ ఏర్పాటు అంశం కూడా సమావేశం అజెండాలో ఉంది. ట్రస్ట్‌కు అధికారిక మీడియా ప్రతినిధిని నియమించే అంశంపైనా చర్చించనున్నారు.
విరాళాల అక్రమాల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పురోగతిని కూడా ట్రస్ట్ సమీక్షించనుంది. ఈ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు విచారణ స్థితిపైనా చర్చ జరగనుంది. విరాళాల అక్రమాల ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసిన మరుసటి రోజు, జూన్ 26న చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేశారు.
తొలి సీఈఓ నియామకం, ట్రస్ట్ డీడ్‌లో మార్పులతో రామ మందిర పరిపాలనలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.