నరసరావుపేట జేఎన్టీయూలో నూతన హాస్టళ్లను ప్రారంభించిన మంత్రి లోకేశ్

Minister Lokesh inaugurated new hostels at Narasaraopet JNTU
  • పల్నాడు జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్
  • నరసరావుపేట జేఎన్టీయూకేలో నూతన హాస్టల్ భవనాల ప్రారంభం
  • రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం
  • గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో వసతి గృహాల నిర్మాణం
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట మండలం కాకాని గ్రామ సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో (జేఎన్టీయూ కాకినాడ పరిధి) నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను ఆయన ప్రారంభించారు. రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థినీ విద్యార్థుల కోసం ఆధునిక సౌకర్యాలతో ఈ వసతి గృహాలను నిర్మించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి లోకేశ్ ఆవిష్కరించారు. అనంతరం గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత హాస్టల్ ప్రాంగణాన్ని, గదులను కలియతిరిగి విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణానికి విచ్చేసిన మంత్రి లోకేశ్ కు యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అలాగే, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ వి.సంజనా సిమ్హా, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
Advertisement
Nara Lokesh
JNTU Narasaraopet
Palnadu District News
Andhra Pradesh Education Minister
JNTU Engineering College Hostels
Narasaraopet JNTU Inauguration

More Telugu News