Advertisement

బ్యాంకింగ్‌ రంగంలో 13,706 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు షురూ.. పూర్తి వివరాలివే

13706 Jobs Applications start from today full details here
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ 2026 దరఖాస్తులు ప్రారంభం
  • మొత్తం 13,706 పోస్టులకు నియామకాలు
  • సెప్టెంబరు 21 వరకు దరఖాస్తుకు అవకాశం
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు 8,183
  • నవంబరులో ప్రిలిమినరీ పరీక్షకు ముందు శిక్షణ
బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌’ (ఐబీపీఎస్‌) 2026-27 సంవత్సరానికి రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో భారీ నియామకాలకు తెరతీసింది. మొత్తం 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ముగిసిన తర్వాత మరో రెండు రోజులు అవకాశం ఉంటుంది.

ఈ నియామకాల్లో ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. వీటికి 8,183 ఖాళీలు ఉన్నాయి. ఆఫీసర్‌ స్కేల్‌-1 (పీఓ) పోస్టులు 4,256, స్కేల్‌-2 (మేనేజర్‌) పోస్టులు 1,047, స్కేల్‌-3 (సీనియర్‌ మేనేజర్‌) పోస్టులు 220 ఉన్నాయి.

ప్రిలిమినరీ పరీక్షకు ముందు శిక్షణ (పీఈటీ) నవంబరులో నిర్వహించనున్నారు. ఆఫీసర్‌ స్కేల్‌-1, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు ఉంటాయి. స్కేల్‌-1కు మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు కామన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది కేటాయింపు మెయిన్స్‌ మార్కులు, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ఖాళీల ఆధారంగా జరుగుతుంది.

ఆఫీసర్‌ స్కేల్‌-2, స్కేల్‌-3 పోస్టులకు ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను కామన్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పరీక్షల షెడ్యూల్‌, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడాలి. అభ్యర్థులు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
IBPS
IBPS RRB Recruitment 2026
Bank Jobs 2026
IBPS Office Assistant Vacancy
Regional Rural Bank Jobs
IBPS PO Recruitment

More Telugu News