భారత్‌ నెత్తిన చైనా ‘నీటి బాంబ్‌’.. జాగ్రత్తగా లేకుంటే ఉత్పాతమే!

China water bomb over India disaster if not careful
  • 60,000 మెగావాట్ల మెడోగ్‌ డ్యామ్‌ నిర్మిస్తున్న చైనా
  • భూకంప ప్రాంతంలో డ్యామ్‌ నిర్మాణంపై ఆందోళన
  • డ్యామ్‌ను ‘వాటర్‌ బాంబ్‌’గా నిపుణులు అభివర్ణన
  • నీటి విడుదలతో ఈశాన్య భారత్‌కు వరద ముప్పు
  • సియాంగ్‌పై భారత్‌ 11,000 మెగావాట్ల ప్రాజెక్టు
నేపాల్‌ను ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు భారత్‌లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న విపత్తు నేపథ్యంలో చైనా నిర్మిస్తున్న భారీ మెడోగ్‌ డ్యామ్‌పై నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది.

60 వేల మెగావాట్ల భారీ ప్రాజెక్టు
చైనా నిర్మిస్తున్న ‘మెడోగ్‌ డ్యామ్‌’ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టుగా నిలవనుంది. సుమారు 60,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం దీని సొంతం. బ్రహ్మపుత్రగా మారే ‘యార్లుంగ్‌ త్సాంగ్‌పో’ నది భారీ మలుపు తిరిగే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు 2033 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చైనా భావిస్తోంది.

భారత్‌కు ఎందుకు ముప్పు?
‘యార్లుంగ్‌ త్సాంగ్‌పో’ నదిపైనే చైనా 60,000 మెగావాట్ల ‘మెడోగ్‌ డ్యామ్‌’ నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్‌లో ‘సియాంగ్‌’గా మారి.. తర్వాత బ్రహ్మపుత్రగా అసోంలో ప్రవహిస్తుంది. భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంలో భారీ డ్యామ్‌ నిర్మిస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా భూవిజ్ఞాన శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ డ్యామ్‌ ప్రాంతం కింద యాక్టివ్‌ ఫాల్ట్‌ ఉన్నట్లు వెల్లడైంది.

‘వాటర్‌ బాంబ్‌’గా నిపుణుల హెచ్చరిక
డ్యామ్‌ పూర్తయితే నీటి ప్రవాహంపై చైనాకు గణనీయమైన నియంత్రణ లభించే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌, అసోంపై వరద ముప్పు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యామ్‌ నిర్మాణంతో భారత్‌ ఈశాన్య ప్రాంతానికి పెద్ద ముప్పు పొంచి ఉందని మాజీ రాయబారి రాజీవ్‌ డోగ్రా సహా పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ సియాంగ్‌ నదిపై 11,000 మెగావాట్ల భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఇది నీటి ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు వరద ముప్పును కొంత తగ్గించేందుకు ఉపయోగపడొచ్చు.
Advertisement
Medog Dam
Brahmaputra River
China India water dispute
Arunachal Pradesh floods
Yarlung Tsangpo
Siang River project

More Telugu News