పూర్తి ట్యాంక్‌, ఫుల్‌ ఛార్జ్‌తో 1,100 కిమీ.. ఎంజీ టొమాహాక్‌ పీహెచ్‌ఈవీ

MG Tomahawk PHEV offers 1100 km range with full tank and full charge
  • భారత్‌లో ఎంజీ హెక్టర్‌ టొమాహాక్‌ ఈవీ, పీహెచ్‌ఈవీ విడుదల
  • పీహెచ్‌ఈవీ ధర రూ.21.79 లక్షల నుంచి ప్రారంభం
  • ఈవీ ప్రారంభ ధర రూ.13.99 లక్షలు
  • ఒక్కసారి ఛార్జ్‌తో ఈవీ 517 కిమీ ప్రయాణం
  • సెప్టెంబర్‌ నుంచి టొమాహాక్‌ ఈవీ డెలివరీలు
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా దేశీయ మార్కెట్లో కొత్త హెక్టర్‌ టొమాహాక్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇందులో ఎలక్ట్రిక్‌ (ఈవీ), ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ (పీహెచ్‌ఈవీ) వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హెక్టర్‌ టొమాహాక్‌ పీహెచ్‌ఈవీ ధర ‘బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌’ (బీఏఏఎస్‌) విధానంలో రూ.21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ కోసం కిలోమీటరుకు రూ.3.2 చెల్లించాల్సి ఉంటుంది. బీఏఏఎస్‌ లేకుండా ఈ మోడల్‌ ధర రూ.25.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి ట్యాంక్‌, పూర్తి ఛార్జ్‌తో ఈ ఎస్‌యూవీ 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది.

పీహెచ్‌ఈవీలో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, డెడికేటెడ్‌ హైబ్రిడ్‌ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 20.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. కేవలం ఎలక్ట్రిక్‌ మోడ్‌లో 115 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో 148 కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను ఉపయోగించారు. ఈ కారు సుమారు 9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అటు హెక్టర్‌ టొమాహాక్‌ ఈవీని బీఏఏఎస్‌ విధానంలో రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేశారు. బీఏఏఎస్‌ లేకుండా దీని ధరలు రూ.19.49 లక్షల నుంచి రూ.23.49 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 69.2 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఎంజీ తెలిపింది. ఈ ఎస్‌యూవీకి సెప్టెంబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

టొమాహాక్‌ ఈవీలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, 8.8 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, వైర్‌లెస్‌ ఛార్జర్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లను అందించారు. 10 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్‌ సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, 256 కలర్‌ యాంబియంట్‌ లైటింగ్‌ కూడా ఉన్నాయి.

ఈవీ వేరియంట్‌లో 150 కిలోవాట్‌ శక్తి, 310 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్‌ మోటార్‌ను ఉపయోగించారు. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.2 సెకన్లలో అందుకుంటుంది. 90 కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 30 నుంచి 80 శాతం వరకు సుమారు 35 నిమిషాల్లో ఛార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
Advertisement
MG Tomahawk
MG Motor India
MG Tomahawk PHEV
MG Tomahawk EV Price
Electric SUV India
Hybrid SUV India

More Telugu News