అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకుల దుర్మరణం
- ఫ్లోరిడా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
- మృతుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ అనే యువకుడు మృతి
- ఇంకా వెల్లడి కాని పూర్తి వివరాలు
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన రాహుల్ అనే యువకుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదం ఏ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలేమిటనే కోణంలో స్థానిక అమెరికన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాహుల్‌తో పాటు ప్రమాదంలో మరణించిన మిగిలిన ఇద్దరు యువకుల వివరాలు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా, రాహుల్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.