గుర్తుతెలియని కాల్స్‌పై పూర్తి సమాచారం.. వాట్సాప్‌ కొత్త భద్రతా ఫీచర్లు ఇవే!

WhatsApp new security features and unknown call information
  • వాట్సాప్‌ ఖాతాకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలు
  • పాస్‌కీలను ఇప్పటికే 100 కోట్ల మందికిపైగా ఉపయోగిస్తున్న వైనం
  • 2ఎఫ్‌ఏలో పొడవైన పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకునే అవకాశం
  • ఇప్పటివరకు ఆరు అంకెల పిన్‌కే పరిమితి 
  • ఆండ్రాయిడ్‌లో కొత్త కాల్‌ స్క్రీనింగ్‌ ఫీచర్‌
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ భద్రతా ఫీచర్లను మరింత బలోపేతం చేసింది. ఒకే ఖాతాకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలు జోడించే అవకాశం కల్పించింది. టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌లో పూర్తి పాస్‌వర్డ్‌ను పెట్టుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం గుర్తుతెలియని కాల్స్‌కు అదనపు వివరాలు చూపించే కొత్త కాల్‌ స్క్రీనింగ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

పాస్‌కీ ఫీచర్‌ను ఇప్పటికే 100 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ ఐడీ లేదా ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ ద్వారా ఖాతాలోకి లాగిన్‌ కావచ్చు. ఇకపై ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాల్లో ఒకే వాట్సాప్‌ ఖాతా వాడుతున్న వారు ఒక్కో పరికరానికి వేర్వేరు పాస్‌కీలను జోడించుకోవచ్చు.

టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌లోనూ కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు ఆరు అంకెల పిన్‌ మాత్రమే పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో కూడిన పొడవైన పాస్‌వర్డ్‌ను కూడా సెట్‌ చేసుకోవచ్చు. దీంతో ఖాతా భద్రత మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై కూడా కొత్త సమాచారం కనిపించనుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కాల్‌ వచ్చిన దేశం, ఆ వ్యక్తితో కామన్‌ గ్రూప్‌ ఉందా లేదా వంటి వివరాలు చూపిస్తుంది. ఈ సమాచారం చూసి కాల్‌ ఎత్తాలా? వద్దా? అనేది వినియోగదారులు నిర్ణయించుకోవచ్చు. మోసపూరిత కాల్స్‌ను అడ్డుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని వాట్సాప్‌ తెలిపింది.
Advertisement
WhatsApp
WhatsApp security features
WhatsApp passkey update
WhatsApp call screening
WhatsApp two step verification
WhatsApp unknown calls information

More Telugu News