వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి
- మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు
- హత్యకు సంబంధించి రూ.40 కోట్ల డీల్పై ప్రధాన దృష్టి
- హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
ఈ హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై... ముఖ్యంగా రూ.40 కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జిషీట్ల ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో భాగంగా ఈడీ ఇప్పటికే పలువురు నిందితులను, అప్రూవర్లుగా మారిన వారిని కూడా విచారించింది. 2019 నుంచి జరిగిన బ్యాంకు లావాదేవీలు, నిధుల బదిలీలపై లోతుగా ఆరా తీస్తోంది. గతంలో హైదరాబాద్, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలతో పాటు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా విచారణతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.