జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి

MLA Virupakshi meets YS Jagan Mohan Reddy after release from jail
  • ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్ట్ అయిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
  • ఇటీవల విరూపాక్షికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • తనను అన్యాయంగా 68 రోజులు జైల్లో పెట్టారన్న విరూపాక్షి
వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఇటీవల బెయిల్‌పై విడుదలైన విరుపాక్షికి ఈ సందర్భంగా జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయనకు భరోసా ఇచ్చారు.

చంద్రబాబు ప్రభుత్వం తనపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు నమోదు చేసిందని, 68 రోజుల పాటు అన్యాయంగా జైల్లో ఉంచిందని ఈ సందర్భంగా విరూపాక్షి ఆరోపించారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో జరిగిన ఘర్షణకు సంబంధించి విరూపాక్షిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విరూపాక్షితో పాటు మరో 40 మందిని అరెస్ట్ చేశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీరందరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విరూపాక్షి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ అధినేత జగన్‌ను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Advertisement
Virupakshi
YS Jagan Mohan Reddy
Alur MLA
YSRCP
Andhra Pradesh High Court
Kurnool Chippagiri Case

More Telugu News