మాతృత్వంపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాతృత్వంపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

Sobhita Dhulipala reacts on becoming a mother interesting comments on family
  • త‌న‌కు ఎప్పటినుంచో ఒక కుటుంబం కావాలని ఉండేదన్న శోభిత‌
  • అవి జరగాల్సినప్పుడే జరుగుతాయని వెల్ల‌డి
  • సమాజం అభిప్రాయాలు వాతావరణం లాంటివి అని వ్యాఖ్య
ప్రముఖ నటి శోభితా ధూళిపాళ తన వ్యక్తిగత జీవితం, మాతృత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎప్పటినుంచో ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని కోరిక ఉందని, అయితే అలాంటివి జరగాల్సిన సమయంలో వాటంతట అవే జరుగుతాయని ఆమె అన్నారు. గతేడాది డిసెంబర్‌లో టాలీవుడ్ నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న శోభిత, పెళ్లి తర్వాత తొలిసారి ఫ్యామిలీ ప్లానింగ్‌పై స్పందించారు.

ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు. "నాకు ఎప్పటినుంచో ఒక కుటుంబం కావాలని ఉంది. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోను. ఎందుకంటే కొన్ని విషయాలు జరగాల్సిన సమయంలో వాటంతట అవే జరుగుతాయి" అని శోభిత వివరించారు. తన తొలి చిత్రం 'రామన్ రాఘవ్ 2.0' తో పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

గతంలో తాను నటులను ఎప్పటికీ డేట్ చేయనని చెప్పిన విషయాన్ని కూడా శోభిత గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఉదాహరణలను చూసి ఒక మూస అభిప్రాయానికి వచ్చానని, అందుకే అలా చెప్పానని అన్నారు. అయితే ఇప్పుడు తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిందని, కాలంతో పాటు అభిప్రాయాలు మార్చుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

తన వ్యక్తిగత జీవితంపై ప్రజలు, మీడియాలో జరిగే చర్చల గురించి మాట్లాడుతూ.. "సమాజం అభిప్రాయాలు వాతావరణం లాంటివి. అవి నిరంతరం మారుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటమే ముఖ్యం" అని శోభిత పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Sobhita Dhulipala
Naga Chaitanya
Motherhood
Family planning
Hollywood Reporter India
Tollywood actress

More Telugu News