తీహార్ జైలుకు వెళ్లిన సీజేపీ నేతలకు బాసటగా రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీహార్ జైలుకు వెళ్లిన సీజేపీ నేతలకు బాసటగా రాహుల్ గాంధీ

Rahul Gandhi slams arrest of CJP leaders Sourav Das and Ashutosh Ranka
  • జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన సీజేపీ నేతలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
  • అరెస్టులను తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం నేరం కాదని వ్యాఖ్య
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినందుకు అరెస్టయిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నేతలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని, ఇందుకోసం యువతను జైల్లో పెట్టడం పిరికిపంద చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... నిరసన ప్రదేశం కాదని ఇటీవల ప్రకటించిన జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం వారిని కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం వారికి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గతంలో ఒకసారి అరెస్టయి, శాంతి ఒప్పందం (పీస్ బాండ్)పై సంతకం చేసి విడుదలైన వీరు... ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినందున కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు అరెస్టయిన అజింక్యా షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.

ఈ అరెస్టులపై రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "జంతర్ మంతర్ భారత ప్రజలది. దానిని మేం తిరిగి స్వాధీనం చేసుకుంటాం. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ఇండియా కూటమి.. అందరిదీ ఒకే లక్ష్యం. అదే పౌరుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ" అని పేర్కొన్నారు. రాహుల్‌తో పాటు అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య థాకరే వంటి పలువురు విపక్ష నేతలు కూడా ఈ అరెస్టులను ఖండించారు. తమకు మద్దతు ప్రకటించినందుకు రాహుల్ గాంధీకి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Rahul Gandhi
CJP leaders arrest
Jantar Mantar protest
Sourav Das Ashutosh Ranka
Tihar Jail judicial custody
INDIA Alliance support

More Telugu News