ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఈడీ నోటీసులు
- విచారణకు హాజరు కావాలని రజత్ భార్గవకు ఈడీ ఆదేశం
- వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
- మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో భాగంగా, హైదరాబాద్లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో రూపొందించిన నూతన మద్యం విధానం, మద్యం బ్రాండ్ల ఆమోదం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రజత్ భార్గవను పలుమార్లు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. సిట్ విచారణలో భాగంగా, నాటి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని, బేస్ ధరల పెంపును తాను వ్యతిరేకించినా పట్టించుకోలేదని భార్గవ వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, ఇప్పుడు ఆర్థిక లావాదేవీల మూలాలను శోధిస్తోంది. భార్గవను ప్రశ్నించడం ద్వారా ఈ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.