ఈ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. వార్న్, అండర్సన్ తర్వాత బూమ్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. వార్న్, అండర్సన్ తర్వాత బూమ్రా

Jasprit Bumrah ranked third in top 10 bowlers of the century after Warne and Anderson
  • ఈ శతాబ్దపు అత్యుత్తమ బౌలర్ల జాబితా విడుదల
  • ఇంగ్లండ్ ఆటగాళ్లు జాస్ బట్లర్, స్టువర్ట్ బ్రాడ్ రూపొందించిన జాబితా
  • భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మూడో స్థానం
  • అశ్విన్, కుంబ్లే వంటి దిగ్గజాలకు దక్కని చోటు
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బూమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 21వ శతాబ్దంలో అత్యుత్తమ బౌలర్లలో మూడో స్థానంలో నిలిచి, తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాడు. ఇంగ్లండ్ ప్రస్తుత ఆటగాడు జాస్ బట్లర్, మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కలిసి రూపొందించిన టాప్-10 బౌలర్ల జాబితాలో బూమ్రా ఈ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తమ 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' అనే పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో వారు ఈ జాబితాను విడుదల చేశారు.

బట్లర్, బ్రాడ్ జాబితాలో ఆస్ట్రేలియా దివంగత లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్ పేస్ గుర్రం జేమ్స్ అండర్సన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వారి తర్వాత మూడో స్థానంలో బూమ్రాకు చోటివ్వడం విశేషం. ఈ క్రమంలో బూమ్రా.. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ (4వ స్థానం), శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (6వ స్థానం), దక్షిణాఫ్రికా పేస్ తుఫాన్ డేల్ స్టెయిన్ (7వ స్థానం) వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ ఐదో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, కగిసో రబడ, షాన్ పొలాక్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉండగా, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పదో స్థానంతో జాబితాను పూర్తి చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 243 మ్యాచ్‌లు ఆడిన బూమ్రా, ఇప్పటివరకు 511 వికెట్లు పడగొట్టాడు. తన అసాధారణ బౌలింగ్ యాక్షన్‌తో స్వదేశీ పిచ్‌లపైనే కాకుండా, ముఖ్యంగా విదేశీ గడ్డపై టెస్టుల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 

అయితే, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, నాథన్ లియాన్ వంటి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఏదేమైనా, సమకాలీన క్రికెటర్ల నుంచి ఈ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం బూమ్రా కెరీర్‌కు లభించిన ఓ గొప్ప గుర్తింపుగా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
Advertisement
Jasprit Bumrah
Top 10 Bowlers 21st Century
Jos Buttler Stuart Broad Podcast
Shane Warne James Anderson
Indian Cricket Team
International Cricket Records

More Telugu News