భిక్షాటన చేస్తూ రూ.8.40 లక్షలు దాచిన వృద్ధురాలు.. చివరికి ఏం జరిగిందంటే?
- కర్ణాటకలో భిక్షాటన చేసే మహిళ ఇంట్లో రూ.8.40 లక్షలు
- మాండ్యలో 68 ఏళ్ల హూర్ మృతి
- 30కి పైగా బస్తాల్లో నగదు, నాణేలు
- రూ.10, రూ.20, రూ.50 నోట్లు భారీగా లభ్యం
- డబ్బును హూర్ సోదరులకు అప్పగింత
కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన 68 ఏళ్ల మహిళ ఇంట్లో రూ.8.40 లక్షల నగదు బయటపడింది. 30కి పైగా బస్తాల్లో నోట్లను, నాణేలను దాచిపెట్టినట్లు గుర్తించారు. అయితే ఆ డబ్బు ఆమెకు ఉపయోగపడకుండానే కన్నుమూశారు.
మాండ్యకు చెందిన హూర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. ఆమె మరణించిన తర్వాత స్థానికులు ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బస్తాల్లో పెద్ద మొత్తంలో నగదు కనిపించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లు భారీగా ఉన్నాయి. వేల సంఖ్యలో నాణేలు కూడా బయటపడ్డాయి.
హూర్ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. ఆమె సోదరి రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఇద్దరికీ వివాహం కాలేదు. హూర్ జీవితమంతా భిక్షాటన చేస్తూ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
బస్తాల్లో ఉన్న నగదును స్థానికులు బయటకు తీసి లెక్కించారు. మొత్తం రూ.8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హూర్ సోదరులకు నగదును అప్పగించారు. ఒక సోదరుడు రూ.6 లక్షలు తీసుకున్నారు. మరో సోదరుడికి రూ.2.40 లక్షలు దక్కాయి. ఆ మొత్తాన్ని ఆయన మసీదుకు విరాళంగా ఇచ్చారు.