50MP కెమెరా.. 6,000mAh బ్యాటరీ.. లావా కొత్త ఫోన్ వచ్చేసింది
- ఫోన్ ధర రూ.15,999
- బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ.13,999
- ఆగస్టు 31 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు
- 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
- 50MP ప్రధాన కెమెరా, 6,000mAh బ్యాటరీ
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. లావా విరాట్ వీ1 ప్రో 5జీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ రూ.15,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లతో దీని ధర రూ.13,999కు తగ్గనుంది. ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
లావా విరాట్ వీ1 ప్రో 5జీ ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. సిక్కిం మిడ్‌నైట్, స్పితి ఫ్రాస్ట్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. ఈ మోడల్ లావా కొత్త విరాట్ సిరీస్‌లో మూడో ఫోన్‌గా వచ్చింది.
ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ దీనికి ప్రత్యేకత. 2.6GHz గరిష్ఠ వేగంతో పనిచేసే యూనిసాక్ టీ8200 ఆక్టాకోర్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఏఐ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 6,000mAh బ్యాటరీ ఫోన్‌కు శక్తినిస్తుంది. ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.
5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి, జీపీఎస్ కనెక్టివిటీ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా ఉంది.