ఓ ఇంటివాడైన టాలీవుడ్ నటుడు ప్రిన్స్.. న్యూజిలాండ్ లో ఘనంగా వివాహం

Prince Cecil gets married in New Zealand in a grand ceremony
  • ప్రియురాలు సాయి ప్రతిమను వివాహమాడిన హీరో ప్రిన్స్
  • న్యూజిలాండ్‌ వేదికగా హిందూ సంప్రదాయంలో పెళ్లి
  • అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వేడుక
  • నటుడు ప్రియదర్శి ద్వారా మొదలైన వీరి ప్రేమకథ
టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ సెసిల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు సాయి ప్రతిమ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. న్యూజిలాండ్‌లోని వనాకా ప్రాంతంలో అత్యంత సుందరమైన ప్రదేశంలో వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

వివాహ వేడుకలో వధువు సాయి ప్రతిమ ఎరుపు రంగు పట్టుచీర, సంప్రదాయ ఆభరణాలతో మహారాణిలా మెరిసిపోగా, వరుడు ప్రిన్స్ ఐవరీ కలర్ ప్రింటెడ్ పైజామాలో రాజకుమారుడిలా కనిపించాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ నూతన జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

వీరిద్దరి ప్రేమకథ కూడా ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. ప్రముఖ నటుడు ప్రియదర్శి ద్వారా ఒక కామన్ ఫ్రెండ్ వివాహ వేడుకలో ప్రిన్స్, సాయి ప్రతిమలకు తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది.

‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ చిత్రంతో హీరోగా పరిచయమైన ప్రిన్స్, ‘బస్ స్టాప్’ సినిమాతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘బిగ్ బాస్ తెలుగు’ మొదటి సీజన్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇటీవల ‘డీజే టిల్లు’, ‘స్కంద’ వంటి విజయవంతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.


Advertisement
Prince Cecil
Sai Pratima
Prince Cecil wedding New Zealand
Tollywood actor Prince marriage
Prince Cecil Bigg Boss Telugu
Prince Cecil DJ Tillu actor

More Telugu News