ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య.. కొత్తకోణం తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి
- పదేళ్ల బాలుడు రియాన్ష్ రెడ్డిని పరామర్శించిన విజయసాయిరెడ్డి
- రియాన్ష్ తల్లి సౌజన్య అంశంపై సంచలన వ్యాఖ్యలు
- ఇది లవ్ జిహాద్‌కు సంబంధించిన ఘటన అని తీవ్ర ఆరోపణ
- రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని తొక్కిపెడుతున్నాయని విమర్శ
- సౌజన్య రాసిన లేఖలోని కీలక అంశాలను బయటపెడుతున్నట్లు వెల్లడి
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన ఏపీలో సంచలనం సృష్టించిందవి. ఈ ఘటన వెనుక 'లవ్ జిహాద్' కోణం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో బతికి బయటపడిన నూకరాజు మనవడు చిన్నారి రియాన్ష్ రెడ్డిని సోమవారం పరామర్శించిన అనంతరం ఆయన ఈ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలోని కొన్ని అంశాలను తాను ప్రజల ముందు ఉంచుతున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. "పదేళ్ల రియాన్ష్ రెడ్డి తల్లి సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో అందరూ తెలుసుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ విషయాలను చదవాలి. ఇది లవ్ జిహాద్‌కు సంబంధించిన ఘటన. ఇలాంటి అంశాలు బయటకు రాకుండా కొన్ని రాజకీయ పార్టీలు అణచివేస్తున్నందున, ఆమె లేఖలోని కీలక అంశాలను ఈ ట్వీట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాను," అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
తల్లిని కోల్పోయి ఒంటరి అయిన చిన్నారి రియాన్ష్‌ను పరామర్శించిన విజయసాయిరెడ్డి, బాలుడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సౌజన్య ఆత్మహత్యను ఒక వ్యక్తిగత విషాదంగా కాకుండా, సమాజం దృష్టి సారించాల్సిన తీవ్రమైన సమస్యగా చూడాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఈ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి వస్తోందని వివరించారు.
.విజయసాయిరెడ్డి ఎక్స్ లో పంచుకున్న సౌజన్య మరణ వాంగ్మూల పత్రం ఇదే...