మోదీ పక్కనే ఉండగా.. ట్రంప్ చేసిన ఆ ఒక్క పని.. అమెరికా రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు
- మోదీ-ట్రంప్ భేటీలో ప్రశ్నలొద్దని కోరిన భారత్
- తొలుత భారత అభ్యర్థనకు అంగీకరించిన ట్రంప్
- భేటీ తర్వాత ఆ విషయం మర్చిపోయిన అమెరికా అధ్యక్షుడు
- భేటీ తర్వాత మీడియా నుంచి ప్రశ్నలు ఆహ్వానించిన ట్రంప్
- ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా రాయబారి సెర్జియో గోర్
పారిస్ సమీపంలో జరిగిన మోదీ-ట్రంప్ భేటీ ప్రశ్నల పర్వంగా మారడం వెనుక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మీడియా ఉండొచ్చు కానీ ప్రశ్నలు అడగకూడదని భారత్ కోరిందట. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత అంగీకరించారట. అయితే సమావేశం ప్రారంభమైన తర్వాత ఆ విషయం మర్చిపోయి స్వయంగా మీడియాను ప్రశ్నలకు ఆహ్వానించారని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు.
భారత్ పెట్టిన ఒక్క అభ్యర్థన
ఫ్రాన్స్‌లో జూన్ 17న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ సమావేశమయ్యారు. భేటీకి ముందు అమెరికా విదేశాంగ ప్రతినిధితో భారత విదేశాంగ శాఖ ఓ అభ్యర్థన చేసిందని గోర్ తెలిపారు. మీడియాను అనుమతించవచ్చు కానీ పూర్తి స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దన్నదే ఆ అభ్యర్థన అని చెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్‌నకు చెప్పగా.. ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అంగీకరించారని గోర్ తెలిపారు.
‘ఎనీ క్వశ్చన్స్?’తో మారిన సీన్
సమావేశం ప్రారంభమైంది. దాదాపు 50 కెమెరాల మధ్య మోదీ, ట్రంప్ తమ ప్రారంభ ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ ఒక్కసారిగా మీడియా వైపు తిరిగి.. “ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని అడిగారని గోర్ చెప్పారు.
అంతే.. అనుకున్న పరిమిత మీడియా కార్యక్రమం పూర్తి స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రశ్నల పరంపర సాగిందని తెలిపారు. సమావేశంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు.
సముద్ర భద్రతపై మోదీ ప్రస్తావన
ఈ భేటీకి ముందు హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత అంశాన్ని ట్రంప్ దృష్టికి మోదీ తీసుకెళ్లారు.
హర్మూజ్ ప్రాంత పరిస్థితులు, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ఇద్దరు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.