ఫిక్స్‌డ్ డిపాజిట్: 20ల్లో ఒకలా.. 60ల్లో ఇంకోలా.. వయసును బట్టి వ్యూహం మారాలి!
- సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ ప్రయోజనం
- వృద్ధులు ఎఫ్‌డీ ల్యాడర్ విధానం బెస్ట్
- నెలవారీ వడ్డీతో ఇంటి ఖర్చులు
- యువతకు ఆరు నెలల ఖర్చులకు అత్యవసర నిధి
- మార్కెట్ పతనంలో పెట్టుబడులను తీసేయకుండా ఎఫ్‌డీతో ప్రయోజనం
ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే డబ్బు పెట్టడం, వడ్డీ తీసుకోవడం, గడువు ముగిసిన తర్వాత తిరిగి పొందడం మాత్రమే కాదు. పెట్టుబడిదారుడి వయసు, అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను బట్టి ఎఫ్‌డీ పాత్ర మారుతుంది. యువతకు ఇది అత్యవసర నిధిగా ఉపయోగపడితే, వృద్ధులకు నెలవారీ ఆదాయానికి ఆధారంగా నిలుస్తుంది. కుటుంబాలకు నిర్దిష్ట ఖర్చుల ప్రణాళికలో తోడ్పడుతుంది.
వృద్ధులకు భద్రతే ముఖ్యం
పదవీ విరమణ చేసిన వారికి మూలధన భద్రత, క్రమం తప్పని ఆదాయం ప్రధాన అవసరాలు. సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు ఎస్‌బీఐ కొన్ని కాలపరిమితుల ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం, ఇతరులకు 6.40 శాతం వడ్డీ ఇస్తోంది.
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 5.25 శాతంగా ఉన్న నేపథ్యంలో ఆకర్షణీయమైన రేట్లు దొరికితే ఎక్కువ కాలానికి లాక్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా వేర్వేరు తేదీల్లో మెచ్యూర్ అయ్యేలా ఎఫ్‌డీ ల్యాడర్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీంతో అత్యవసర సమయంలో పెద్ద డిపాజిట్‌ను మధ్యలోనే విరమించాల్సిన పరిస్థితి ఉండదు.
నెలవారీ ఖర్చులకు ఆసరా
నెలవారీ వడ్డీ చెల్లింపు ఎంపికను ఎంచుకుంటే ఇంటి ఖర్చులకు కొంత ఊరట లభిస్తుంది. అర్హులైన సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80టీటీబీ కింద రూ.50 వేల వరకు మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఒకే బ్యాంకులో భారీగా డిపాజిట్లు పెట్టకుండా పరిమితి పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
యువతకు అత్యవసర కవచం
ఇరవై ఏళ్ల వయసులో ఉన్నవారికి దీర్ఘకాల సంపద సృష్టికి ఎఫ్‌డీ ప్రధాన సాధనం కాకపోవచ్చు. ద్రవ్యోల్బణం, పన్నుల ప్రభావం రాబడిని తగ్గిస్తాయి. అయినా కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకోవడం అవసరం. మార్కెట్లు పతనమైనప్పుడు షేర్లు, ఇతర పెట్టుబడులను నష్టాల్లో అమ్మాల్సిన పరిస్థితిని ఈ అత్యవసర నిధి తప్పిస్తుంది.
కుటుంబాలకు లక్ష్యాల వారీగా
పిల్లల స్కూల్ ఫీజు, బీమా ప్రీమియం, ఇంటి అడ్వాన్స్ వంటి ప్రతి అవసరానికి వేర్వేరు ఎఫ్‌డీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఖర్చు ఎప్పుడు వస్తుందో దానికి అనుగుణంగా మెచ్యూరిటీ తేదీని నిర్ణయించుకోవాలి. ఎక్కువ వడ్డీ ఇచ్చే ఎఫ్‌డీనే ఉత్తమమని భావించకూడదు. మన డబ్బుకు అప్పగించిన పని ఏంటన్నదే ముందు చూడాలి.