ఫార్చూనర్‌లో వచ్చి.. చీపురు పట్టే స్ఫూర్తి కథ.. ఏ పనీ చిన్నది కాదంటున్న పారిశుద్ధ్య కార్మికుడు!
- మంగళూరులో ఫార్చ్యూనర్ కారులో డ్యూటీకి వస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు
- రోజుకు రూ.50 కూలీతో జీవితాన్ని ప్రారంభించి కలను సాకారం చేసుకున్న శేషప్ప
- పారిశుధ్య పనులతో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమతో అదనపు ఆదాయం
- కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, ప్రతి పనిలో గౌరవం ఉంటుందని నిరూపణ
- కుటుంబం కోసం కొత్త ఇల్లు కట్టడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడి
మంగళూరు బంట్వాళ్ బీసీ రోడ్డులో ఉదయాన్నే ఓ పారిశుద్ధ్య కార్మికుడు డ్యూటీకి రావడం సాధారణ విషయమే. కానీ, అదే కార్మికుడు ఏకంగా రూ.35 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారులో వచ్చి, చీపురు పట్టుకుని రోడ్లు ఊడవడం ప్రారంభిస్తే... అదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న ఆ కార్మికుడి పేరు శేషప్ప (45).
బంట్వాళ్‌లోని నవూర్‌కు చెందిన శేషప్ప 1996లో రోజుకు కేవలం రూ.50 కూలీతో పారిశుధ్య కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. మూడో తరగతి మాత్రమే చదివిన ఆయన, బంట్వాళ్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్‌లో చేరి ఆ తర్వాత పర్మనెంట్ ఉద్యోగి అయ్యారు. ఒకప్పుడు పూట గడవడానికే కష్టపడిన రోజులను గుర్తుచేసుకున్న ఆయన, తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే తపనతో అదనపు పనులపై దృష్టి సారించారు.
పారిశుద్ధ్య వృత్తితో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమను కూడా నమ్ముకున్నారు. ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే విధులకు హాజరై మధ్యాహ్నం వరకు రోడ్లు శుభ్రం చేసి, ఆ తర్వాత తన డెయిరీ ఫామ్ పనులు చూసుకుంటారు. "ఏ పనీ తక్కువ కాదని నేను నమ్ముతాను. కష్టపడి పని చేసి, అవసరమైతే అప్పులు తీసుకుని నా కార్ల కలను నెరవేర్చుకున్నాను" అని శేషప్ప గర్వంగా చెబుతారు. వాహనాలపై ఉన్న మక్కువతో మొదట మారుతి 800, ఆ తర్వాత ఆల్టో, స్కార్పియో కొన్నారు. పాత వాహనాన్ని అమ్మి, మరికొంత అప్పు చేసి కొత్త కారు కొనడం ఆయన అలవాటు. అలా చివరకు తన కలల కారైన సెకండ్ హ్యాండ్ ఫార్చ్యూనర్‌ను సొంతం చేసుకున్నారు.
తన తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు డబ్బుల్లేక, తానే మృతదేహాన్ని నేత్రావతి నది ఒడ్డుకు మోసుకెళ్లిన చేదు అనుభవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాంటి కష్టాల నుంచి బయటపడి తన భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి మంచి జీవితాన్ని అందించగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. శేషప్ప నిజాయతీ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఉద్యోగి అని, ఆయనకు అప్పగించిన పనిని ప్రశ్నించాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదని బంట్వాళ్ మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ తీర్థప్రసాద్ ప్రశంసించారు. ప్రస్తుతం తన కుటుంబం కోసం ఓ కొత్త ఇల్లు కట్టుకోవడమే తన తదుపరి లక్ష్యమని శేషప్ప తెలిపారు.