‘హర్మూజ్’ మాదేనన్న ట్రంప్.. విధ్వంసకరంగా బదులిస్తామన్న ఇరాన్
- హర్మూజ్ జలసంధిని తమ భూభాగంగా భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్
- ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండనివ్వబోమని ప్రతిన
- ఆరు నెలలుగా జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ నుంచి ఎలాంటి కొత్త ముప్పు ఎదురైనా దానికి విధ్వంసకరమైన సైనిక చర్యతో సమాధానం ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
సౌత్ కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని నేను అమెరికా భూభాగంగానే చూస్తున్నాను. ఆ ప్రాంతం మొత్తం, దాని పరిసర భూభాగాలపై కూడా మాకు పూర్తి నియంత్రణ ఉంది" అని ప్రకటించారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు కలిగి ఉండనివ్వబోమని, అలా జరిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ దళాల చీఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి ఘాటుగా బదులిచ్చారు. తమ బలగాలు భూమి, సముద్రం, గాలి, సైబర్‌స్పేస్‌లలో శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శత్రువు నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా తమ సైన్యం తీవ్రంగా, విధ్వంసకరంగా తిప్పికొడుతుందని ఇరాన్ మీడియాకు తెలిపారు.
ప్రపంచంలోని చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద గత ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ జలసంధిలో రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించగా, అమెరికా నావికాదళంతో దిగ్బంధనం అమలు చేస్తోంది. తమ షరతులు నెరవేరే వరకు జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ స్పష్టం చేస్తుండగా, ఆర్థిక ఆంక్షలతో అమెరికా ఒత్తిడి పెంచుతోంది.