వివేకా హత్య కేసు: ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ. 24 లక్షల నగదు స్వాధీనం
- వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు
- ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసం సహా 7 చోట్ల సోదాలు
- హత్య కోసం రూ. 40 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై దర్యాప్తు
- సీబీఐ చార్జిషీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ, శుక్రవారం హైదరాబాద్, కడప నగరాల్లోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తనిఖీలు ముగిసిన అనంతరం ఆ వివరాలను ఈడీ 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.
ఈ సోదాల్లో నేరానికి సంబంధించినవని భావిస్తున్న పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి చెందిన ప్రాంగణాల్లో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.
సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌తో పాటు అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ ఈడీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ హత్యకు రూ.40 కోట్లు చెల్లించేలా కుట్ర జరిగిందని దస్తగిరి వెల్లడించినట్లు తెలిపింది. ఇందులో తన వాటాగా రూ.5 కోట్లు ఇస్తామని టి. గంగిరెడ్డి హామీ ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. దస్తగిరికి వై. సునీల్ యాదవ్ నుంచి రూ. కోటి అందగా, అందులో రూ.25 లక్షలను సునీల్ యాదవ్ తన వద్దే ఉంచుకుని, మిగిలిన రూ.75 లక్షలను తన స్నేహితుడు సయ్యద్ మున్నాకు ఇచ్చినట్లు దస్తగిరి వెల్లడించాడని ఈడీ వివరించింది. సయ్యద్ మున్నా, అతని తల్లి లాకర్ల నుంచి సీబీఐ గతంలో రూ.46.70 లక్షల నగదుతో పాటు లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఈడీ ప్రస్తావించింది.
2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇప్పటికే పలు చార్జిషీట్లను దాఖలు చేసింది. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డి. శివశంకర్‌రెడ్డి, టి. గంగిరెడ్డి, వై. సునీల్ యాదవ్ తదితరులను నిందితులుగా సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు ఈడీ వెల్లడించింది.