‘గ్రామీణ భారత్‌కు స్టార్‌లింక్‌ మేలు చేస్తుంది’.. ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

Starlink will benefit rural India says Elon Musk
  • దేశంలో 11,256 గ్రామాలకు ఇంకా 4జీ సదుపాయం లేదంటూ పోస్ట్‌
  • దీనికి స్పందిస్తూ అక్కడ స్టార్‌లింక్‌ సేవలు ఉపయోగకరంగా ఉంటాయన్న మస్క్‌
  • భారత్‌లో కొనసాగుతున్న స్టార్‌లింక్‌ అనుమతుల ప్రక్రియ
భారత్‌లో ఇంటర్నెట్‌ సదుపాయం అంతగా లేని ప్రాంతాలకు స్టార్‌లింక్‌ ఉపయోగపడుతుందని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ మేలు చేస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో స్టార్‌లింక్‌ వాణిజ్య సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.

‘ఎక్స్‌’లో ఓ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 మే నాటికి దేశంలో 11,256 గ్రామాలకు 4జీ సదుపాయం లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్‌ వినియోగంలో భారీ తేడా ఉందని వివరించారు.

2026 మార్చి నాటికి భారత్‌లో 109.3 కోట్ల ఇంటర్నెట్‌ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా 44.087 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో 100 మందికి 48.31 ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణాల్లో ఈ సంఖ్య 126.80గా ఉంది.

మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలు, దీవులు, విపత్తుల ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల కొరత వల్ల సంప్రదాయ టెలికాం సేవలు అందించడం కష్టంగా ఉంటుంది. దేశంలో భారత్‌నెట్‌ ద్వారా 8.5 లక్షల రూట్‌ కిలోమీటర్లకు పైగా ఫైబర్‌ వేశారు. సుమారు 2.21 లక్షల గ్రామ పంచాయతీలను సేవలకు సిద్ధం చేశారు. 

స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభం కావాలంటే నియంత్రణ అనుమతులు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు పూర్తి కావాలి. ఈ ప్రక్రియ పూర్తయితే మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Elon Musk
Starlink India
Satellite Internet
SpaceX
Rural Internet Connectivity
Digital Divide India

More Telugu News