5 స్టార్ హోటల్లో దోశ ఇలా తినాలట.. వైరల్ వీడియోపై నెటిజన్ల సెటైర్లు!
- 5 స్టార్ హోటల్లో దోశ తినే వీడియో వైరల్
- దోశ తినే పద్ధతిని చూపించిన ఎటికెట్ కోచ్
- స్పూన్, ఫోర్క్‌తో దోశ తినడం చూపించిన వైనం
- ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేసిన మనస్ ముదులి
- వీడియోపై నెటిజన్లు సెటైర్లు
దోశ.. దక్షిణాది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం. వేడి వేడి దోశను చేతితో ముక్కలు చేసి చట్నీ, సాంబార్‌తో తినడం చాలామందికి అలవాటు. కానీ 5 స్టార్ హోటల్లో దోశ తినాలంటే మాత్రం చేతులు ఉపయోగించకూడదా? స్పూన్, ఫోర్క్‌తోనే తినాలా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ ప్రశ్నలను లేవనెత్తింది.
వైరల్ వీడియోలో ఓ ఎటికెట్ కోచ్ దోశను ఎలా తినాలో చూపించారు. ముందుగా దోశ రెండు చివర్లను మధ్యకు మడిచారు. ఆ తర్వాత స్పూన్‌తో దోశ నుంచి ఓ ముక్కను విడదీశారు. దాన్ని ఫోర్క్‌తో తీసుకుని తిన్నారు. 5 స్టార్ హోటల్‌లో దోశను ఇలా తినాలంటూ వీడియోలో చూపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ వీడియోను ‘ఎక్స్’లో మనస్ ముదులి అనే యూజర్ షేర్ చేశారు. 5 స్టార్ హోటల్‌లో రూ.1,500 చెల్లించి దోశ తింటే చేతులతో తినడానికి అనుమతి ఉండదన్నట్టుగా ఆయన వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టారు. ఫోర్క్, స్పూన్ తప్పనిసరి అంటూ వీడియోను పంచుకున్నారు.
వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. దోశను భారతీయ పద్ధతిలోనే తినాలని కొందరు సూచించారు. మరికొందరు ఈ విధానం చాలా విచిత్రంగా ఉందని కామెంట్ చేశారు. ఓ యూజర్ అయితే దోశ, ఇడ్లీ లాంటి వంటకాలకు ఫోర్క్, స్పూన్ పక్కన పెట్టి చేతులతో తినడమే సరైన పద్ధతి అని వ్యాఖ్యానించారు. మరోవైపు 5 స్టార్ హోటళ్లలో ఇలాంటి నిబంధన ఏదీ లేదని కొందరు స్పష్టం చేశారు.