మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా? 3 నెలల్లో పిల్లల్లో మార్పు తెచ్చే 6 సింపుల్ అలవాట్లు!
- రోజూ 10 నిమిషాలు టేబుల్స్ ప్రాక్టీస్ చేయించాలి
- మ్యాథ్స్ కష్టమని కాకుండా ప్రాక్సీస్ చేస్తే ఈజీ అని చెప్పాలి
- లెక్కలో తుది సమాధానం కాకుండా ప్రతి స్టెప్స్ రాయించాలి
- రోజూ మెంటల్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయించాలి
- పాతవి, కొత్త టాపిక్స్ కలిపి ఇవ్వాలి
మ్యాథ్స్ హోంవర్క్ కోసం గంటల తరబడి కూర్చున్నా.. మరుసటి రోజు అదే తప్పులు చేస్తున్నారా? అయితే సమస్య చదివే సమయం కాకపోవచ్చు. పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేదే అసలు విషయం. మ్యాథ్స్ టీచర్ అశ్విని ఆనంద్ సూచనల ప్రకారం.. రోజూ కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే పిల్లల్లో లెక్కలపై పట్టు క్రమంగా పెరగొచ్చు. మూడు నెలల పాటు ఈ ఆరు అలవాట్లను పాటిస్తే మంచి మార్పు కనిపించే అవకాశం ఉంది.
టేబుల్స్.. స్క్వేర్ రూట్స్ పక్కాగా ఉండాలి
రోజూ 10 నిమిషాలు టేబుల్స్, స్క్వేర్ నంబర్లు ప్రాక్టీస్ చేయించాలి. ఉదాహరణకు 12 × 12 = 144 వంటి లెక్కలు త్వరగా చెప్పేలా అలవాటు చేయాలి. దీంతో ప్రాథమిక లెక్కలు వేగంగా చేయగలుగుతారు.
రోజూ మ్యాథ్స్ ఈజీ అని చెప్పండి
పిల్లల ముందు మ్యాథ్స్ కష్టం అనే మాటలు మాట్లాడకుండా.. ప్రాక్టీస్ చేస్తే సులభంగా నేర్చుకోవచ్చని చెప్పాలి. తప్పు చేసినప్పుడు తిట్టడం కంటే మరోసారి ప్రయత్నించేలా ప్రోత్సహించాలి. ఇది మ్యాథ్స్‌పై భయాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చు.
జవాబు కాదు.. ప్రతి స్టెప్ ముఖ్యం
పిల్లలు కేవలం చివరి జవాబు రాయకుండా.. లెక్కను ఎలా చేశారో ప్రతి దశను రాయాలి. జవాబు తప్పయితే మొత్తం లెక్కను మళ్లీ చెప్పడం కంటే.. మొదట తప్పు చేసిన స్టెప్‌ను గుర్తించాలి. ముఖ్యంగా డివిజన్, ఫ్రాక్షన్స్, ఆల్జీబ్రాలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
రోజూ 10 నిమిషాల మెంటల్ మ్యాథ్స్
రోజూ 10 నిమిషాలు చిన్న లెక్కలు వేగంగా చేయించేలా ప్రాక్టీస్ చేయించాలి. 25 × 4, 150 ÷ 5, 99 + 36, 86లో సగం, 200లో 15 శాతం వంటి లెక్కలు ఇవ్వొచ్చు. పిల్లలను తొందర పెట్టడం కాకుండా.. ఆలోచనా శక్తి, కచ్చితత్వం పెంచడమే లక్ష్యంగా ఉండాలి.
పాతవి.. కొత్తవి కలిపి ప్రాక్టీస్
ఒకే రకం లెక్కలు పదేపదే చేయించడం వల్ల పిల్లలు పద్ధతిని మాత్రమే గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అందుకే ఫ్రాక్షన్స్, పర్సంటేజీలు, వర్డ్ ప్రాబ్లమ్స్, ఆల్జీబ్రా వంటి వేర్వేరు టాపిక్స్ నుంచి లెక్కలు కలిపి ఇవ్వాలి. దీంతో ఏ లెక్కకు ఏ పద్ధతి ఉపయోగించాలో పిల్లలు ఆలోచించడం నేర్చుకుంటారు.
కష్టం నెమ్మదిగా పెంచాలి
మొదట పిల్లలు సులభంగా చేయగలిగే లెక్కలతో ప్రారంభించాలి. పట్టు పెరిగిన తర్వాత రెండు, మూడు దశల్లో పరిష్కరించాల్సిన ప్రశ్నలు ఇవ్వాలి. మొదటి నెలలో బలహీనమైన అంశాలు, పదేపదే చేసే తప్పులపై దృష్టి పెట్టాలి. రెండో నెలలో మిక్స్‌డ్ ప్రాక్టీస్ పెంచాలి. మూడో నెలలో చిన్న టైమ్ టెస్టులు పెట్టి పురోగతిని గమనించాలి.
పిల్లలను గంటల తరబడి చదివించడం కంటే.. రోజూ కొద్దిసేపు సరైన పద్ధతిలో ప్రాక్టీస్ చేయించడం ముఖ్యం. మూడు నెలల్లో లక్ష్యం ఎక్కువ లెక్కలు చేయించడం కాదు.. తప్పులు తగ్గించడం, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, కొత్త లెక్కలను ప్రయత్నించే ధైర్యం పెంచడం.