లోకేశ్ తో ఉల్లాసంగా అచ్చెన్న, విష్ణుకుమార్ రాజు... ఫొటోలు ఇవిగో!
- అసెంబ్లీ సమావేశాల అనంతరం కూటమి నేతల ఉల్లాసభరిత క్షణాలు
- యువ నాయకత్వం, అనుభవం కలగలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామన్న నేతలు
- కూటమి ప్రభుత్వ విజన్‌తో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యమని స్పష్టీకరణ
- భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య మైత్రి మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిన్న తొలి రోజు సమావేశాల అనంతరం ఉల్లాసంగా కనిపించారు. ఈ సమావేశంపై అచ్చెన్నాయుడు, విష్ణుకుమార్ రాజు ఇరువురూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తో సరదాగా ముచ్చటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వేర్వేరుగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు.
"కూటమి ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. యువ నాయకత్వం, సీనియర్ల అనుభవం కలగలిపి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ముందుకు సాగుతాం!" అని వారు తమ పోస్టుల్లో స్పష్టం చేశారు. ఈ సందేశంతో పాటు, ముగ్గురు నేతలు సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలను కూడా వారు పంచుకున్నారు.