నిధి అగర్వాల్‌ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్‌ థ్రిల్లర్‌!

Nidhhi Agerwal New Movie A Mythological Thriller
  • వరాహ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న సినిమా
  • నిధి పుట్టినరోజున ప్రారంభమైన చిత్రీకరణ
  • సినిమాకు శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం
  • హీరోయిన్‌ ప్రధానంగా సాగే కథ
హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి ఆమె ఓ విభిన్న కథతో అలరించనున్నట్లు తెలుస్తోంది. నిధి తదుపరి చిత్రం మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని సినీ వర్గాల సమాచారం. హీరోయిన్‌ ప్రధానంగా సాగే ఈ కథలో ఆమె ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

వరాహ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆ సంస్థకు తొలి ప్రొడక్షన్‌. సునీత్‌ పడోల్కర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘తంత్ర’ ఫేమ్‌ శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. అదే రోజు చిత్రీకరణ కూడా మొదలైంది.

సినిమా ప్రారంభోత్సవంలో పి. అశోక్‌, పి. రేణుక తొలి షాట్‌కు కెమెరా స్విచాన్‌ చేశారు. నిధి అగర్వాల్‌ చిత్రబృందంతో కలిసి కార్యక్రమంలో పాల్గొంది. ప్రభాస్‌ నటించిన ‘ది రాజా సాబ్‌’, పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరి హర వీర మల్లు’ చిత్రాల్లో నిధి నటనకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సినిమా ప్రారంభం సందర్భంగా మేకర్స్‌ నిధి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. అందులో ఆమె ఒక చేతిలో దీపం పట్టుకుని.. మరో చేతితో దానికి రక్షణగా నిలిచినట్లు కనిపిస్తోంది. వెనుక భాగంలో అనేక చేతులతో ఉన్న దేవత ఆకారం కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి హీరోయిన్‌ చుట్టూ తిరిగేలా బలమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Nidhhi Agerwal
Mythological Thriller
Srinivas Gopishetti
Varaha Films
Nidhhi Agerwal New Movie
Telugu Cinema

More Telugu News