లైవ్ టీవీలో సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య వ్యాఖ్యల యుద్ధం

Sanjay Manjrekar and Murali Kartik war of words on live TV
  • శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇబ్బందికర సన్నివేశం
  • మీ ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో కొన్ని సార్లు అర్థం కాదన్న మురళి
  • కెమెరా రహానే వైపు తిప్పండి.. ఆయన ముఖం బాగుంటుందన్న మంజ్రేకర్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా లైవ్ కామెంట్‌రీ బాక్స్ - స్టూడియో మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణ కాస్తా వాడివేడి వివాదంగా మారింది. భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ ఆన్-ఎయిర్ లైవ్ షోలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


వివరాల్లోకి వెళితే... టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుండి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు.  


దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు.


వాతావరణం కాస్త సీరియస్‌గా మారుతుండటంతో, మంజ్రేకర్ "మనం హద్దులు దాటి మాట్లాడుకుంటే సోషల్ మీడియాకి మంచి కంటెంట్ దొరుకుతుంది" అని వ్యాఖ్యానించి నవ్వుతూ పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు.

Advertisement
Sanjay Manjrekar
Murali Kartik
Ajinkya Rahane
India vs Sri Lanka Test
Cricket commentary controversy
Live TV spat

More Telugu News