ఈ ఫోన్‌లో వెనుక మరో డిస్‌ప్లే.. భారత్‌లో టెక్నో పొవా 8 ప్రో 5జీ
- ఫోన్ ధర రూ.49,999
- ఆగస్టు 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయం
- ఇందులో 6,500mAh బ్యాటరీ
- 144Hz అమోలెడ్ డిస్‌ప్లే
- 50MP ప్రధాన కెమెరా
- వెనుక 177 ఎల్‌ఈడీల అలైవ్ మ్యాట్రిక్స్
టెక్నో నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. పొవా 8 ప్రో 5జీ పేరుతో మంగళవారం ఈ ఫోన్‌ను సంస్థ విడుదల చేసింది. 6,500mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా దీని ప్రత్యేకతలు. ఫోన్ వెనుక భాగంలో 177 మినీ ఎల్‌ఈడీలతో ‘అలైవ్ మ్యాట్రిక్స్’ డిస్‌ప్లేను కూడా అందించారు. ఇది వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన లైటింగ్ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది.
భారత్‌లో పొవా 8 ప్రో 5జీ ధర రూ.49,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆగస్టు 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టండ్రా గ్రీన్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల హైపర్‌లక్స్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1,208×2,644 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16తో పనిచేస్తుంది. రెండు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని టెక్నో తెలిపింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. 4nm తయారీ ప్రక్రియతో రూపొందిన ఈ చిప్ 2.6GHz గరిష్ఠ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. వేడిని నియంత్రించడం కోసం 5,000 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థ ఉంది. వెనుక 50MP ప్రధాన కెమెరాకు ఓఐఎస్, 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంది.
6,500mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ కూడా ఉన్నాయి. ఫోన్ బరువు సుమారు 189 గ్రాములు.