మద్యం సేవించి డ్రైవింగ్.. డేవిడ్ వార్నర్‌కి జరిమానా.. ఇకపై కారు నడపాలంటే ఆ పరికరం తప్పనిసరి!
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వార్నర్ దోషిగా నిర్ధారణ
- సిడ్నీ కోర్టు 1500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధింపు
- కారు నడపాలంటే 'ఇంటర్‌లాక్ పరికరం' తప్పనిసరి అని ఆదేశం
- ఈ కేసు తన టీ20 కెరీర్‌పై ప్రభావం చూపుతుందని లాయర్ వాదన
- ఘటన సమయంలో కారులో పిల్లలు ఉండటంతో నేరం తీవ్రత పెరిగిందని జడ్జి వ్యాఖ్య
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చుక్కెదురైంది. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చిన సిడ్నీ కోర్టు, 1500 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.1లక్ష) జరిమానా విధించింది. దీంతో పాటు అతను వాహనం నడపాలంటే కఠినమైన షరతులు విధించింది.
గత ఏప్రిల్ 5న ఈస్టర్ ఆదివారం నాడు వార్నర్ (39) మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారు ఆపి, పక్క సీటులో ఉన్న ప్రయాణికుడితో సీటు మారేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా, చట్టబద్ధమైన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువ మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది.
నేడు ఈ కేసుపై సిడ్నీలోని వేవర్లీ స్థానిక కోర్టు తుది తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా వార్నర్ తరఫు లాయర్ ఆసక్తికర వాదనలు వినిపించారు. ఈ కేసు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం వల్ల వార్నర్ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాడని, ఇది అతని వాణిజ్య అవకాశాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడే అవకాశాలను దెబ్బతీస్తుందని కోర్టుకు తెలిపారు.
అయితే, జడ్జి క్లేర్ ఫార్నాన్ ఈ వాదనలను తోసిపుచ్చారు. ప్రజల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సంఘటన జరిగినప్పుడు కారులో పిల్లలు కూడా ఉన్నారని, ఇది నేరం తీవ్రతను పెంచుతోందని వ్యాఖ్యానించి, శిక్షను ఖరారు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం వార్నర్ ఇకపై తన కారుకు 'ఇంటర్‌లాక్ డివైస్' అమర్చుకుంటేనే డ్రైవింగ్ చేయగలడు. ఈ పరికరం డ్రైవర్ శ్వాసలో మద్యం ఉన్నట్లు గుర్తిస్తే కారును స్టార్ట్ కానివ్వదు.