వరుసగా మూడో రోజూ నష్టాల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
- ఒడిదొడుకుల మధ్య నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- 113 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- 40 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన రూపాయి విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ముగిశాయి. గురువారం నాడు రోజంతా ఒడిదొడుకుల మధ్య కదలాడిన సూచీలు, మదుపరుల నుంచి మిశ్రమ స్పందనతో చివరికి స్వల్ప నష్టాలతో ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 113.61 పాయింట్లు క్షీణించి 78,079.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40.10 పాయింట్లు నష్టపోయి 24,395.85 వద్ద క్లోజ్ అయింది.
అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. దీంతో ఈ షేర్లు నిఫ్టీలో టాప్ లూజర్లుగా నిలిచాయి. అయితే, ప్రధాన సూచీలు బలహీనంగా ఉన్నప్పటికీ, బ్రాడర్ మార్కెట్లు రాణించడం గమనార్హం. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం చొప్పున లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే, మెటల్ షేర్లలో బలహీనత కారణంగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒక శాతానికి పైగా పతనమైంది. మరోవైపు, నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడిన రంగంగా నిలిచింది.
ఇక, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఈరోజు కూడా క్షీణించింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.