Advertisement

ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? ఈ 3 చిట్కాలతో ఇక ఆ బాధ ఉండదు!

Lifestyle
Advertisement
  • ఉల్లిపాయ కోసినప్పుడు విడుదలయ్యే ఘాటు పదార్థంతో కళ్లలో మంట
  • ఆ మంటను తగ్గించేందుకు కళ్లు కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి
  • ఉల్లిపాయను అరగంట ఫ్రిజ్‌లో ఉంచితే మంట తగ్గొచ్చు
  • పదునైన కత్తితో కోస్తే కన్నీళ్లు తగ్గే అవకాశం
  • గాగుల్స్‌ పెడితే రసాయనాల ఆవిరి కళ్లను చేరదు
ఉల్లిపాయ కోయడం మొదలుపెట్టగానే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎంత త్వరగా కోసినా.. అవి మాత్రం ఆగవు. అసలు ఉల్లిపాయకు, మన కన్నీళ్లకు సంబంధమేంటి? దీనంతటికీ ఓ చిన్న కెమిస్ట్రీ కారణం ఉంది. అంతేకాదు.. ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు తగ్గించుకునేందుకు మూడు సింపుల్‌ ట్రిక్స్‌ కూడా ఉన్నాయి.

ఉల్లిపాయను కోసినప్పుడు దాని కణాలు దెబ్బతింటాయి. దీంతో లోపల విడివిడిగా ఉన్న సల్ఫర్‌ సమ్మేళనాలు, ‘అల్లినేస్‌’ అనే ఎంజైమ్‌ ఒకదానితో ఒకటి చర్య జరుపుతాయి. ఫలితంగా ‘ప్రొపానెథియల్‌-ఎస్‌-ఆక్సైడ్‌’ అనే కంటికి మంట కలిగించే పదార్థం తయారవుతుంది. అది గాలిలో కలిసి కళ్లను తాకగానే కన్నీళ్లు వస్తాయి.

ఫ్రిజ్‌లో పెట్టి కోయండి
ఉల్లిపాయ కోయడానికి ముందు దాన్ని సుమారు అరగంట ఫ్రిజ్‌లో పెట్టండి. చల్లగా ఉన్న ఉల్లిపాయలో ఈ రసాయన చర్య కొంత నెమ్మదిగా జరుగుతుంది. దాంతో కళ్లకు చేరే ఘాటు ఆవిరి కూడా కొంత తగ్గుతుంది. ఫ్రిజ్‌ నుంచి తీసిన వెంటనే కోస్తే మంచి ఫలితం ఉండొచ్చు.

కత్తి పదునుగా ఉండాలి
మొద్దుబారిన కత్తితో ఉల్లిపాయను కోస్తే.. అది సరిగ్గా కోయడం కంటే ఎక్కువగా నలిగిపోతుంది. దాంతో ఉల్లిపాయలోని ఎక్కువ కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా కళ్లకు మంట పెట్టే పదార్థం ఎక్కువగా బయటకు వస్తుంది. అందుకే పదునైన కత్తితో ఒక్కో ముక్కను వేగంగా, సాఫీగా కోయడం మంచిది. దీనివల్ల కన్నీళ్లు తగ్గడంతో పాటు కత్తి జారే ప్రమాదం కూడా తగ్గుతుంది.

కళ్లకు గాగుల్స్‌ పెట్టుకోండి
ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. బాగా పనిచేసే చిట్కా ఇదే. కిచెన్‌ గాగుల్స్‌ లేదా స్విమ్మింగ్‌ గాగుల్స్‌ పెట్టుకుని ఉల్లిపాయ కోస్తే ఆ ఘాటు ఆవిరి కళ్లను చేరదు. దీంతో కన్నీళ్లు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గాగుల్స్‌ లేకపోతే ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ దగ్గర ఉల్లిపాయ కోయడం లేదా కిటికీ తెరిచి ఉంచడం కూడా ఉపయోగపడుతుంది.

అయితే అన్ని ఉల్లిపాయలు ఒకేలా ఉండవు. కొన్ని రకాల ఉల్లిపాయలు ఎక్కువ ఘాటుగా ఉంటాయి. వాటిని కోసినప్పుడు కన్నీళ్లు కూడా ఎక్కువగా వస్తాయి. అంటే.. మీరు ఉల్లిపాయపై కోప్పడాల్సిన అవసరం లేదు. అది తనను తాను కాపాడుకునేందుకు చేసే ఓ చిన్న రసాయన ప్రక్రియే. మన కళ్లు దానికి స్పందించి నీళ్లు కారుస్తాయంతే.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

OnionOnion tears preventionCutting onion tipsPropanethial S oxideKitchen hacksOnion chemistry

More Telugu News

విదేశీ టీ20 లీగ్‌లపై ఐసీసీ కొరడా.. కొత్త ఆంక్షలకు రంగం సిద్ధం!

12 Nov, 18:43

నీటిని తోడేస్తున్న ధనిక రైతులు.. రీచార్జ్ చేస్తున్న పేద రైతులు! రాయలసీమ భూగర్భ జలాలపై ఐఐఎస్సీ కీలక అధ్యయనం

12 Nov, 18:34

పాత కేసులో కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

12 Nov, 18:21

తెలంగాణాలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు.. వీసీ సజ్జనార్‌కు కొత్త పోస్టు

12 Nov, 17:58

ఎస్బీఐ లాకర్ తెరిచి చూస్తే అంతా ఖాళీ.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి షాక్

12 Nov, 17:41

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు: 10 నెలల్లో రూ.44,305 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు

12 Nov, 17:32

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.800 కోట్లతో ఆస్ట్రోబేస్ రాకెట్ టెస్టింగ్ కేంద్రం విస్తరణ

12 Nov, 17:26

విశాఖ పార్టనర్‌షిప్ సమ్మిట్ కేవలం ప్రచారం కోసమే: గుడివాడ అమర్నాథ్

12 Nov, 17:25

టీమిండియాకు బిగ్‌ బూస్ట్‌.. న్యూజిలాండ్‌ చేరుకోనున్న రిషభ్‌ పంత్

12 Nov, 17:23

అండర్‌-19 ఆసియా కప్‌ సెమీస్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఫైనల్లో పాక్‌తో పోరుకు సై

12 Nov, 17:15

కీలక ఖనిజాల వేటలో భారత్ దూకుడు.. ప్రపంచంలోనే రెండో స్థానం

12 Nov, 17:02

రిసాల్వెన్ సీఈవో పరాగ్ శర్మతో నారా లోకేశ్ భేటీ.. సీమలో భారీ ప్రాజెక్టుకు ఆహ్వానం

12 Nov, 17:00

తండ్రి ఆస్తిలో కొడుకుకు జన్మహక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు కీలక తీర్పు

12 Nov, 16:50

గత జన్మలో నేను రాజుని.. నా భార్య మంత్రిని ప్రేమించింది: సంజయ్ దత్ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం

12 Nov, 16:44

టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

12 Nov, 16:43
..More Telugu News