Advertisement

పులి మలమూత్రాలతోనే వయసు, లింగం తెలుసుకోవచ్చా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం

Science
Advertisement
  • పులి, చిరుత వాసనతో కీలక వివరాలు గుర్తించే కొత్త పద్ధతి
  • మలమూత్రాల్లోని రసాయనాలతో జాతి, వయసు, లింగం గుర్తింపు
  • గర్భిణి పులులను గుర్తించే రసాయన సంకేతం కనుగొన్న శాస్త్రవేత్తలు
  • రణథంబోర్‌లో పులుల నమూనాలు సేకరించిన పరిశోధకులు
  • కెమెరా ట్రాప్‌లకు కొత్త పద్ధతి అదనపు సాధనంగా మారే అవకాశం
  • పులుల ఆరోగ్యం, సంతానోత్పత్తిపై మెరుగైన సమాచారం పొందే ఛాన్స్‌
  • ఇతర అరుదైన జంతువుల పర్యవేక్షణకూ ఈ పద్ధతి ఉపయోగపడే అవకాశం
అడవిలో పులి కనిపించకపోయినా.. దాని జాడను గుర్తించే కొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పులి, చిరుత వదిలే మలమూత్రాల వాసన ఆధారంగా వాటి జాతి, వయసు, లింగం, పునరుత్పత్తి స్థితిని గుర్తించే పద్ధతిని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌’ (ఎన్‌సీబీఎస్‌) పరిశోధకులు అభివృద్ధి చేశారు.

వాసనలో దాగిన సమాచారం
పులులు, చిరుతలు తమ పరిధిని గుర్తించేందుకు చెట్లపై మూత్రం చిమ్ముతుంటాయి. మలాన్ని కూడా వదులుతుంటాయి. వీటిలో ఉండే ‘వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌’ ప్రత్యేక రసాయన సంకేతాలను కలిగి ఉంటాయి. వీటిని విశ్లేషించడం ద్వారా జంతువు గురించి కీలక సమాచారం తెలుసుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు.

బెంగళూరు, అహ్మదాబాద్‌, వడోదరలోని జంతు ప్రదర్శనశాలల్లో పులులు, చిరుతల నుంచి నమూనాలు సేకరించారు. రాజస్థాన్‌లోని రణథంబోర్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల నుంచి కూడా నమూనాలు తీసుకున్నారు. అత్యాధునిక రసాయన విశ్లేషణ పద్ధతులు, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించి వందలాది నమూనాలను పరిశీలించారు.

గర్భిణి పులులను గుర్తించే అవకాశం
పరిశోధనలో 2-నోననాల్‌ అనే రసాయనం పునరుత్పత్తికి సంబంధించిన సంకేతాలను ఇస్తున్నట్లు తేలింది. గర్భంతో ఉన్న, పిల్లలకు పాలిస్తున్న ఆడ పులుల్లో ఈ రసాయనం ఎక్కువగా కనిపించింది. భవిష్యత్తులో అడవిలో పులి కనిపించకుండానే దాని సంతానోత్పత్తి పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుతం పులుల లెక్కింపులో కెమెరా ట్రాప్‌లు, జన్యు పరీక్షల వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అయితే వాటితో వయసు, ఆరోగ్యం, పునరుత్పత్తి స్థితిని తెలుసుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. కొత్త విధానం వాటికి అదనపు సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

పులుల పరిరక్షణకు కొత్త ఆయుధం
ఎన్‌సీబీఎస్‌ పరిశోధన ‘జర్నల్‌ ఆఫ్‌ కెమికల్‌ ఎకాలజీ’లో ప్రచురితమైంది. ఈ విధానం తక్కువ ఖర్చుతో, జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నమూనాలు సేకరించే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవి కుక్కలు, మంచు చిరుతల వంటి ఇతర అరుదైన జంతువుల పర్యవేక్షణకు కూడా దీన్ని ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

TigersNCBS researchersTiger conservationWildlife monitoringRanthambore Tiger ReserveMachine learning

More Telugu News

ఏపీకి దిగ్గజ సంస్థల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు

12 Nov, 23:24

మంగళగిరిలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించిన మిరానా రియల్టీ.. 9.5 ఎకరాల్లో 59 ప్రీమియం విల్లాలు

12 Nov, 23:16

క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని సౌదీ అరేబియాలా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్

12 Nov, 23:05

ముంబైలో అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు

12 Nov, 22:55

లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ రావాలి: ఎన్విడియా సీఈవో మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలు

12 Nov, 22:48

విశాఖలో సీఐఐ సదస్సు.. మంత్రి లోకేశ్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

12 Nov, 22:20

మహిళా కమిషన్ ఎదుట హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి

12 Nov, 22:07

జనసైనికులకు వైసీపీ లీగల్ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

12 Nov, 21:53

శత్రుచర్ల విజయరామరాజు మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం

12 Nov, 21:36

రన్‌వేపైకి దూసుకొచ్చిన వీధి కుక్క.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ లో తప్పిన పెనుప్రమాదం

12 Nov, 21:26

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించిందని మహిళకు కొరడా దెబ్బలు

12 Nov, 21:14

నిజంగా మహాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే తండ్రికి రూ.1.5 కోట్ల లాటరీ!

12 Nov, 20:58

వాషింగ్టన్ లో కాల్పులు.. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కలకలం

12 Nov, 20:44

సత్య నాదెళ్లను వెనక్కినెట్టి నెం.1గా సుందర్ పిచాయ్

12 Nov, 20:40

టెస్టు అరంగేట్రంలోనే 7 వికెట్లు.. శ్రీలంకపై సంచలనం సృష్టించిన పాక్ బౌలర్ సాకిబ్ ఖాన్

12 Nov, 20:15
..More Telugu News