అనంతపురంలో షాకింగ్ ఘటన.. కూతురిపై కన్ను.. ప్రియుడి మర్మాంగం కోసేసిన తల్లి!
- ప్రియురాలి కూతురిపై కన్నేసిన ఆటో డ్రైవర్
- కూతురితో అసభ్య ప్రవర్తనపై తల్లి ఆగ్రహం
- బుద్ధి చెప్పాలని పక్కా ప్లాన్‌తో దాడి
- ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ.. ఆసుపత్రిలో బాధితుడు
అనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తూ, తన కూతురిపైనే కన్నేసిన వ్యక్తికి ఓ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె, ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేశ్‌కు వివాహమైంది. అయినప్పటికీ, డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు డిగ్రీ చదువుతున్న కూతురు ఉంది. కొంతకాలంగా సురేశ్, ఆమె కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లికి చెప్పడంతో, సురేశ్‌కు ఎలాగైనా గుణపాఠం నేర్పాలని ఆమె నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సురేశ్ యథావిధిగా ఆమె ఇంటికి వచ్చాడు. ఇదే సరైన సమయమని భావించిన మహిళ, అతడిని మాటల్లో పెట్టింది. ఓ చీరతో సురేశ్ కాళ్లు, చేతులు కట్టేసి.. "నా కూతురి జోలికి వస్తావా" అంటూ దాడి చేసింది. ఆ తర్వాత కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది.
నొప్పితో సురేశ్ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు విని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.