యుద్ధానికి బ్రేక్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందన్న ట్రంప్
- ఇరాన్‌పై జరపాల్సిన దాడులను రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన ట్రంప్
- ఇరాన్, పశ్చిమాసియా దేశాల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయమన్న అధ్యక్షుడు
- హర్మూజ్ జలసంధిని తెరవాలనేది ఒప్పందంలో కీలక షరతు
- ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని వెల్లడి
- అమెరికా దూకుడుగా వ్యవహరిస్తే తిప్పికొడతామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. ఇరాన్‌పై వారాంతంలో జరపాల్సిన దాడులను రద్దు చేసుకున్నట్టు ఆదివారం వెల్లడించారు. ఇరాన్‌తో పాటు ఇతర పశ్చిమాసియా దేశాలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఓ ఒప్పందానికి సంబంధించిన పరిమితులపై అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు. అయితే, ఈ ఒప్పందం వేగంగా ఖరారైతేనే దాడుల విరమణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ వివరాలు పంచుకున్నారు. త్వరలో కుదరబోయే ఒప్పందం ప్రకారం.. హర్మూజ్ జలసంధిని తక్షణమే, సంపూర్ణంగా తెరవడంతో పాటు, ఇరాన్ అణు ముప్పునకు ముగింపు పలకాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. "ఒప్పందం పరిమితులపై అంగీకారం కుదిరినందున, ఎటువంటి దాడికి పాల్పడవద్దని ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాలు మమ్మల్ని కోరాయి. ఈ విజ్ఞప్తి ఆధారంగా, ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా దాడిని రద్దు చేసేందుకు అంగీకరించాను" అని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు.
గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఈ ఒప్పందం పూర్తి చేసే ప్రయత్నంలో అమెరికాతో చేతులు కలిపేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ఇజ్రాయెల్ నుంచి తక్షణమే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు, అమెరికా ఎలాంటి సాహసోపేత చర్యలకు పాల్పడవద్దని టెహ్రాన్ ఈ వారాంతంలో తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్ లక్ష్యాలపై కొత్త దాడులు చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను నిజం చేస్తే, నిర్ణయాత్మకంగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. శనివారం టర్కీ, పాకిస్థాన్, సౌదీ అరేబియా ఉన్నతాధికారులతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా ‘అస్థిరపరిచే చర్యల’ వల్ల కలిగే పరిణామాల గురించి ఆయన చర్చించారు. ఏదైనా దురాక్రమణకు పాల్పడితే గట్టిగా బదులిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, తమ దేశంలోని పలు కీలక కేంద్రాలపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను ధ్వంసం చేసినట్లు కువైట్ సైన్యం ప్రకటించింది.