ముంబై దాదర్ స్టేషన్‌లో హైడ్రామా.. క్షణాల్లో వ్యక్తిని కాపాడిన మహిళా కానిస్టేబుల్.. ఇదిగో వీడియో!
- ముంబై దాదర్ స్టేషన్‌లో కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం
- అప్రమత్తంగా వ్యవహరించి వ్యక్తిని కాపాడిన మహిళా కానిస్టేబుల్
- ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సీసీటీవీలో రికార్డైన నాటకీయ దృశ్యాలు
- మహిళా పోలీస్ సాహసంపై నెటిజన్ల ప్రశంసల వర్షం
- యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రానికి తరలింపు
ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అప్రమత్తంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని నివారించారు. ఆత్మహత్య చేసుకునేందుకు కదులుతున్న లోకల్ ట్రైన్ కిందకు వెళ్లబోయిన ఓ వ్యక్తిని ఆమె క్షణాల్లో కాపాడారు. గురువారం రాత్రి 10:54 గంటల సమయంలో జరిగిన ఈ నాటకీయ ఘటన స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
వివరాల్లోకి వెళితే.. ప్లాట్‌ఫామ్ నుంచి లోకల్ ట్రైన్ నెమ్మదిగా కదులుతుండగా, 28 ఏళ్ల యువకుడు రైలు కిందకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న ఏ. నర్వాడే అనే మహిళా కానిస్టేబుల్ వెంటనే స్పందించారు. వేగంగా పరుగెత్తుకెళ్లి, ఆ వ్యక్తి కాళ్లు పట్టుకుని వెనక్కి లాగేశారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి, పునరావాస కేంద్రానికి తరలించనున్నట్లు సమాచారం.
ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియో 'ఎక్స్' (ట్విట్టర్)లో షేర్ చేయగా, ఆ మహిళా అధికారిణి సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఆ మహిళా అధికారిణి అద్భుతంగా పనిచేశారు", "ఒక ప్రాణాన్ని కాపాడిన అధికారిణికి సెల్యూట్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.