Advertisement

హాలీవుడ్ నటుడు విన్సెంట్ పాస్టోర్ అనుమానాస్పద మృతి

Hollywood actor found dead under suspicious circumstances
  • 'ది సోప్రానోస్' సిరీస్‌తో విన్సెంట్ ప్రపంచవ్యాప్త గుర్తింపు
  • న్యూయార్క్‌లోని నివాసంలో మృతి
  • గ్యాంగ్‌స్టర్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన పాస్టోర్
'ది సోప్రానోస్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్సెంట్ పాస్టోర్ (80) కన్నుమూశారు. న్యూయార్క్‌లోని తన నివాసంలో ఆయన మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

గత కొన్ని రోజులుగా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు, ఆయన నివాసానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

క్రైమ్ డ్రామా సిరీస్ 'ది సోప్రానోస్'లో ఆయన పోషించిన సాల్వటోర్ ‘బిగ్ పుస్సీ’ బాన్‌పెన్‌సీరో పాత్ర విశేష ప్రజాదరణ పొందింది. గ్యాంగ్‌స్టర్, టఫ్-గై తరహా పాత్రలకు ఆయన పెట్టింది పేరు. 'గుడ్‌ఫెల్లాస్', 'కార్లిటోస్ వే', 'షార్క్ టేల్' వంటి చిత్రాలతో పాటు దాదాపు 150కి పైగా సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లలో ఆయన నటించి తనదైన ముద్ర వేశారు.

విన్సెంట్ పాస్టోర్ ఆకస్మిక మరణం పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.                                
Advertisement
Vincent Pastore
The Sopranos
Hollywood actor death
Salvatore Big Pussy Bonpensiero
New York
Goodfellas actor

More Telugu News