Advertisement

మంత్రి లోకేశ్‌పై అనుచిత పోస్ట్: వైసీపీ సోషల్ మీడియా నేత అరెస్ట్

Nara Lokesh Derogatory Post YSRCP Social Media Leader Arrested
  • ప్రశ్నించిన టీడీపీ నేతకు చంపేస్తానని బెదిరింపులు
  • పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘటన
  • సన్నపనేని వెంకట్రావును అరెస్ట్ చేసిన పోలీసులు
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై పల్నాడు జిల్లా వినుకొండ మండలం పనకలపాలెంకు చెందిన వైసీపీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు సన్నపనేని వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

లోకేశ్‌ను కించపరిచేలా వెంకట్రావు ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. దీనిని ప్రశ్నించిన టీడీపీ నాయకుడు  వీరగంధం ప్రశాంత్‌ను చంపేస్తానని హెచ్చరించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు వెంకట్రావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
Advertisement
Nara Lokesh
Sannapaneni Venkatrao
YSRCP Social Media
Vinukonda
Palnadu
Social Media Arrest

More Telugu News