మాంసం ప్రియులకు ఊరట.. దిగివచ్చిన చికెన్, గుడ్ల ధరలు
- గత నెల రోజులుగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు తగ్గుముఖం
- ప్రస్తుతం రూ. 250- రూ. 250 మధ్య లభిస్తున్న చికెన్
- ఒక్కో గుడ్డు ధర రూ. 6 నుంచి రూ. 7 మధ్యలో లభ్యం
- సరఫరా మెరుగుపడటమే ధరల తగ్గుదలకు కారణమంటున్న వ్యాపారులు
గత నెల రోజులుగా ఆకాశాన్నంటిన చికెన్, గుడ్ల ధరలు ఎట్టకేలకు దిగివస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరలు గణనీయంగా తగ్గడంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు పెరిగిన ధరలతో ఇబ్బంది పడిన మాంసం ప్రియులు, ప్రస్తుతం ధరలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
గతంలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 300 నుంచి రూ. 330 వరకు పలకగా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 250 నుంచి రూ. 280 మధ్య లభిస్తోంది. గతంలో రూ. 8 నుంచి రూ. 9 వరకు పెరిగిన ఒక్కో గుడ్డు ధర, ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో రూ. 6 నుంచి రూ. 7కు తగ్గింది.
ప్రాంతాల వారీగా ధరలను పరిశీలిస్తే.. తెలంగాణలోని వరంగల్‌లో కిలో చికెన్ అత్యల్పంగా రూ. 250కి విక్రయిస్తుండగా, హైదరాబాద్, కామారెడ్డిలలో రూ. 270గా ఉంది. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రూ. 280 పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, మార్కాపురంలో రూ. 260 ఉండగా, గుంటూరులో కిలో చికెన్ ధర రూ. 280 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో సరఫరా మెరుగుపడటం, డిమాండ్‌లో వచ్చిన మార్పుల కారణంగానే ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.