జంక్ ఫుడ్ మాన్పించేందుకు తండ్రి సూపర్ ప్లాన్.. వీడియో వైరల్!
- ఫేక్ అల్ట్రాసౌండ్‌లో పురుగు చూపించి చిన్నారికి అవగాహన
- వీడియో వైరల్.. పేరెంటింగ్‌పై ప్రశంసలు
- అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై నిపుణుల హెచ్చరిక
- ఇంట్లో జంక్ ఫుడ్ నిల్వ చేయొద్దని సూచన
- పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయం
పిల్లలు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలంటే బెదిరింపులు, బలవంతాలు అవసరం లేదని ఓ తండ్రి నిరూపించాడు. కూతురికి పిజ్జాలు, చిప్స్, చాక్లెట్లు తినొద్దని చెప్పే బదులు.. చిన్న నాటకం ఆడాడు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నట్లు నటించి, ఆమె పొట్టలో జంక్ ఫుడ్ వల్ల ఓ పురుగు పెరుగుతోందని చూపించాడు. ఆ చిన్నారి ముఖంలో కనిపించిన ఆశ్చర్యం, భయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సరదాగా చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు పేరెంటింగ్‌పై పెద్ద చర్చకు దారి తీసింది.
వైరల్ వీడియోలో చిన్నారి మంచంపై పడుకుని ఉండగా, తండ్రి అల్ట్రాసౌండ్ స్కానర్‌లా కనిపించే పరికరాన్ని ఆమె పొట్టపై తిప్పుతాడు. స్క్రీన్‌పై ఓ చిన్న పురుగు కదులుతున్న యానిమేషన్ కనిపిస్తుంది. ‘నువ్వు ఎక్కువగా స్వీట్లు, జంక్ ఫుడ్ తింటున్నందుకే ఇది నీ పొట్టలో పెరుగుతోంది’ అని తండ్రి చెప్పడంతో చిన్నారి నిజంగానే నమ్మేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘నెక్స్ట్ లెవెల్ పేరెంటింగ్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
అయితే నిపుణులు మాత్రం ఈ వీడియో వెనుక ఉన్న అసలు సందేశాన్ని గుర్తుచేస్తున్నారు. జంక్ ఫుడ్ అంటే కేవలం బర్గర్లు, పిజ్జాలు మాత్రమే కాదు. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు, కృత్రిమ పదార్థాలు కలిగిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులోకే వస్తాయి. ఇవి పిల్లల్లో ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గిపోవడం, ఏకాగ్రత సమస్యలు వంటి ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా ఈ ఆహారాలు పదేపదే తినాలనే కోరికను కూడా పెంచుతాయి.
పిల్లల్లో మంచి ఆహారపు అలవాట్లు పెంచాలంటే ఇంట్లో జంక్ ఫుడ్‌ను నిల్వ చేయకుండా ఉండటమే మొదటి అడుగని నిపుణులు సూచిస్తున్నారు. వాటి బదులు పండ్లు, ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన చిరుతిళ్లు అందుబాటులో ఉంచాలని చెబుతున్నారు. పిల్లలు చూసేది, దొరికేదే ఎక్కువగా తింటారు కాబట్టి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆకర్షణీయంగా అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తుచేస్తున్నారు.