అల్లా ఆదేశమంటూ ప్యారిస్‌లో వ్యక్తి వీరంగం.. గర్భిణి సహా ముగ్గురిపై కత్తితో దాడి
- ప్యారిస్ వీధుల్లో కత్తులతో ఓ వ్యక్తి దాడి
- అల్లా ఆదేశంతోనే చేశానంటున్న నిందితుడు
- దాడిని అడ్డుకుని నిందితుడిని పట్టుకున్న స్థానికులు
- నిందితుడి మాటలు పొంతన లేకుండా ఉన్నాయన్న పోలీసులు
ప్యారిస్ నగర వీధుల్లో సోమవారం ఓ వ్యక్తి కత్తులతో బీభత్సం సృష్టించాడు. వంటగదిలో ఉపయోగించే రెండు కత్తులు పట్టుకుని.. అల్లా ఆదేశంతోనే ఈ దాడి చేస్తున్నానంటూ ముగ్గురు మహిళలపై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరు గర్భిణి అని అధికారులు తెలిపారు.
ఉత్తర ప్యారిస్‌లోని పోర్ట్ డి క్లిచీ ప్రాంతంలో, ప్యారిస్ కోర్టు సమీపంలో ఈ సంఘటన జరిగింది. క్రీమ్ రంగు ట్రాక్‌సూట్ ధరించిన ఓ వ్యక్తి, రెండు కత్తులతో మహిళలపై దాడికి పాల్పడ్డాడు. దాడికి గురైన మహిళల వయసు 19, 24, 36 సంవత్సరాలని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్థానికులు ధైర్యంగా ఆ దాడిని అడ్డుకున్నారు. మహ్మద్-అలీ బౌహద్జర్ అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీస్తూనే, నిందితుడిని ఆపాలని కేకలు వేశాడు. ఒకరు నిందితుడిపై సూట్‌కేస్ విసరడంతో అతని చేతిలోని కత్తులు కిందపడిపోయాయి. వెంటనే మరికొందరు అతడిని పట్టుకుని కిందపడేసి బంధించారు. కిందపడి ఉన్నప్పుడు కూడా "ఇది అల్లా ఆజ్ఞ" అని నిందితుడు చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఓ ఆఫ్-డ్యూటీ పోలీస్ అధికారి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో నిందితుడి మాటలు పొంతన లేకుండా ఉన్నాయని, దాడికి అసలు కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. నిందితుడి వివరాలను ధ్రువీకరించే పనిలో అధికారులు ఉన్నారు.