Advertisement

జోగి రమేశ్ కుటుంబంలో ఎవరెవరి మీద కేసు నమోదయిందంటే..!

Jogi Ramesh family members list in the registered case
  • జోగి రమేశ్ కుటుంబంపై అదనపు కట్నం వేధింపులు, గృహ హింస కేసు నమోదు
  • రమేశ్ పెద్ద కోడలు మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు
  • మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆయన పెద్ద కోడలు జోగి మేఘన పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేశ్‌తో పాటు మొత్తం 11 మంది కుటుంబసభ్యులపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


సూర్యాపేట/కోదాడ ప్రాంతానికి చెందిన మేఘనకు, జోగి రమేశ్‌ పెద్ద కుమారుడు జోగి రాజీవ్‌తో 2025 మే 28న వివాహమైంది. అయితే పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. వేధింపులు ఆపాలంటే అదనంగా మరో రూ. 5 కోట్ల కట్నం తీసుకురావాలని డిమాండ్‌ చేశారని ఆరోపించారు. ఇంట్లోని పైఅంతస్తు గదిలో తనను ఒంటరిగా బంధించి, ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేసేవారని పేర్కొన్నారు. నిలదీస్తే కుటుంబసభ్యులంతా కలిసికట్టుగా తనపై దాడి చేశారని, భర్త రాజీవ్ నిత్యం కోపంతో కొట్టేవాడని, అందరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం నిందితుల జాబితా:

  • జోగి రాజీవ్ (భర్త)

  • జోగి రమేశ్‌ (మాజీ మంత్రి / మామ)

  • జోగి శకుంతల (అత్త)

  • జోగి రోహిత్ (మరిది)

  • జోగి ప్రియాంక (ఆడపడుచు)

  • జోగి రాము (రమేశ్‌ సోదరుడు)

  • రాకేశ్ (రాము కుమారుడు)

  • పాండు (రాము కుమారుడు)

  • స్వామి (రమేశ్‌ బావమరిది)

  • రమ (రమేశ్‌ సోదరి)

  • సంతోశ్ / సాయి (స్వామి కుమారుడు)

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గృహహింస, వరకట్న నిరోధక చట్టంతో పాటు హత్యాయత్నం వంటి తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రస్తుతం వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
Jogi Ramesh
Jogi Rajiv
Jogi Meghana
Dowry Harassment Case
Ibrahimpatnam Police
YSRCP Leader

More Telugu News