Advertisement

రెండు కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. వందమందిపై డాక్టర్ రేప్ చేశాడన్న నిందితురాలు!

Twist in two crore extortion case as accused claims doctor raped hundred women
  • రాజస్థాన్‌లో డాక్టర్‌ను బెదిరించిన నర్సు కమల అరెస్ట్
  • రెండు కోట్ల రూపాయలు గుంజినట్లు వైద్యుడి ఫిర్యాదు
  • డిజిటల్ ఆధారాలు సేకరించి నర్సును జైలుకు పంపిన పోలీసులు
ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని బెదిరించి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో కమల అనే నర్సును రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను కోర్టులో హాజరుపరిచే సమయంలో సదరు నర్సు ఆ వైద్యుడిపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు డాక్టర్ వందమందికి పైగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఘరానా నేరస్థుడని ఆమె ఆరోపించింది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితురాలు కమల 2016 నుంచి సదరు డాక్టర్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో డాక్టర్ ఫోన్ నుంచి ఆయన వ్యక్తిగత ఫొటోలను తన ఫోన్‌లోకి రహస్యంగా పంపుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, రేప్ కేసు పెడతానని బెదిరిస్తూ రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

అయితే కోర్టు బయట మీడియా ముందు మాట్లాడిన నర్సు.. తనపై మోపిన కేసులన్నీ నకిలీవని తెలిపింది. సదరు డాక్టర్ ఎంతోమంది మహిళా రోగులను వేధించాడని, డబ్బులతో కేసులను మేనేజ్ చేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఇంకా ధ్రువీకరించలేదు. నిందితురాలు విచారణకు సహకరించడం లేదని, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Kamala
Barmer doctor extortion case
Rajasthan nurse arrest
Two crore blackmail case
Doctor rape allegations Rajasthan
Barmer police investigation

More Telugu News